విధి వైప‌రిత్యం అంటే ఇదేనేమో.. కూతురు పెళ్లై 24 గంటలు గడవకముందే!

19 Mar, 2023 13:44 IST|Sakshi
భర్తతో కలిసి కన్యాదానం చేస్తున్న స్వరూప(ఫైల్‌)

సాక్షి, సి​ద్దిపేట జిల్లా: ఆ ఇంట పెళ్లిసందడి ముగియకముందే చావుబాజా మోగింది. పెద్దకూతురు పెళ్లి జరిగి 24 గంటలు గడవకముందే తల్లి గుండెపోటుతో మృతి చెందింది. వివరాలు ఇలా ఉన్నాయి. సిద్దిపేట జిల్లా మద్దూరు మండలంలోని బంజార గ్రామానికి చెందిన జగిలి స్వరూప(35)కు ముగ్గురు కూతుళ్లు. పెద్ద కూతురుకు శుక్రవారం వివాహం జరిగింది. ఇంటిల్లిపాది పెళ్లిసందడిలో ఆనందంగా ఉన్నారు.

శనివారం ఉదయం కూతుర్ని అత్తగారింటికి పంపేందుకు ఒకవైపు అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అంతలోనే తల్లి సర్వూప ఒక్కసారిగా గుండెపోటుతో తుది శ్వాస విడిచింది. దీంతో ఒక్కసారిగా పెళ్లింట విషాదఛాయలు నెలకొన్నాయి. పెద్దకూతురికి కన్యాదానం చేసి, చిన్నకూతురుతో తలకొరివి పెట్టించుకుందంటూ కుటుంబసభ్యులు, బంధువులు రోదిస్తున్న తీరు పలువురిని కంటతడిపెట్టించింది.

మరిన్ని వార్తలు :

ASBL
మరిన్ని వార్తలు