నేడు కాళేశ్వరానికి సీఎం కేసీఆర్‌

19 Jan, 2021 00:55 IST|Sakshi

ఆలయంలో తొలుత పూజలు.. ఆపై మేడిగడ్డ బ్యారేజీ సందర్శన

ఇరిగేషన్‌ ఇంజనీర్లతో ముఖ్యమంత్రి సమీక్ష

సాక్షి, హైదరాబాద్‌: సీఎం కె. చంద్రశేఖర్‌రావు మంగళవారం ఉదయం కాళేశ్వరం పర్యటనకు వెళ్లనున్నారు. ఉదయం 10 గంటలకు హెలికాప్టర్‌లో బేగంపేట నుంచి బయలుదేరి 11 గంటలకు కాళేశ్వర ముక్తీశ్వర దేవాలయానికి సీఎం చేరుకుంటారు. అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించాక అక్కడి నుంచి కాళేశ్వరం ఎత్తిపోతల పథకంలో భాగంగా ఉన్న మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ పరిధిలో ఏరియల్‌ వ్యూ ద్వారా తిలకిస్తారు.

మేడిగడ్డలో ఇప్పటికే నిల్వ ఉంచిన 16 టీఎంసీల నీటిని మేడిగడ్డ పంప్‌హౌస్‌ ద్వారా ఎత్తిపోస్తున్న తీరును సీఎం పరిశీలించనున్నారు. అనంతరం అక్కడే ఇరిగేషన్‌ ఇంజనీర్లతో సమీక్షించనున్నారు. ప్రస్తుత యాసంగి సీజన్‌కు సంబంధించి దిగువ ఎల్లంపల్లి, మిడ్‌మానేరుకు నీటి ఎత్తిపోతల అంశంపై ఇంజనీర్లకు మార్గదర్శనం చేసే అవకాశం ఉంది. అనంతరం అక్కడే అధికారులు, ఇంజనీర్లతో కలసి భోజనం చేయనున్న కేసీఆర్‌.. మధ్యాహ్నం 3 గంటలకు హైదరాబాద్‌ తిరుగు పయనం కానున్నారు. చదవండి: (బీజేపీ.. బక్వాస్‌ జ్యాదా పార్టీ)

మరిన్ని వార్తలు