ఇంటి నుంచి పనిచేయడానికేనా ఉద్యోగం?

22 Aug, 2021 21:13 IST|Sakshi
కలెక్టర్‌ అనుదీప్‌

సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌పై కలెక్టర్‌ ఆగ్రహం

భద్రాచలం(ఖమ్మం): భద్రాచలంలోని ఐటీడీఏ ప్రాంగణంలో ఉన్న మొబైల్‌ కోర్టు సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌పై జిల్లా కలెక్టర్‌ అనుదీప్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. భద్రాచలంలో శనివారం పర్యటించిన కలెక్టర్‌ ఆకస్మికంగా మొబైల్‌ కోర్టును తనిఖీ చేశారు. బీరువాలు తీయించి ఫైళ్లను పరిశీలించగా, సబ్‌ డివిజనల్‌ మెజిస్ట్రేట్‌ అనిల్‌కుమార్‌ కార్యాలయ విధులకు రాకుండా ఇంటి నుంచి కార్యాలయ ఉత్తర ప్రత్యుత్తరాలు నిర్వర్తిస్తున్నట్లు గుర్తించారు.     చదవండి: ( Pani Puri Man Viral Video: ఓరి దుర్మార్గుడా.. పానీపూరీలో అది కలిపావేంట్రా )

హైదరాబాద్‌లో ఉండి సిబ్బంది ద్వారా ఫైళ్లు తెప్పించుకుని సంతకాలు చేస్తుండటమే కాకుండా స్వాతంత్య్ర వేడుకలకూ రాకుండా సిబ్బందితో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించినట్లు తెలుసుకున్నారు. అలాగే వాద, ప్రతివాదులకు నోటీసులు జారీ చేయకుండా ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేసినట్లు గుర్తించారు. దీంతో ఇంటి నుంచి పనిచేయడానికేనా ఉద్యోగమని కలెక్టర్‌ ఆగ్రహం వ్యక్తంచేశారు. ఈ సందర్భంగా విధుల పట్ల నిర్లక్ష్యం వహించిన సీనియర్‌ అసిస్టెంట్‌ రషీద్, రికార్డు అసిస్టెంట్‌ వహీద్‌ను సస్పెండ్‌ చేస్తూ కలెక్టర్‌ అక్కడికక్కడే ఆదేశాలు జారీచేశారు. తర్వాత న్యాయవాదులతో భేటీ కాగా, అవసరమైన సిబ్బందిని నియమించడంతో పాటు అన్ని వసతులతో కూడిన భవనాన్ని మంజూరు చేయాలని వారు విన్నవించారు.

చదవండి:( ముద్దు సీన్లలో నటించడం వాళ్లకు నచ్చేది కాదు: ప్రీతి జింగానియా )

           

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు