క్రీడాకారులకు ‘సాక్షి’ ప్రోత్సాహం భేష్

7 Apr, 2021 20:10 IST|Sakshi

శంషాబాద్‌ డీసీపీ ప్రకాష్‌ రెడ్డి

మొయినాబాద్‌: క్రీడల్లో గెలుపు, ఓటమి సమానమేనని, క్రీడాకారులు పోరాట పటిమ, క్రీడా స్ఫూర్తిని చాటాలని శంషాబాద్‌ డీసీపీ ప్రకాష్‌రెడ్డి అన్నారు. ‘సాక్షి’ మీడియా గ్రూప్, వీఐటీ–ఏపీ యూనివర్సిటీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ‘సాక్షి’ ప్రీమియర్‌ లీగ్‌ క్రికెట్‌ టోర్నమెంట్‌ మంగళవారం ముగిసింది. నగర శివారులోని మొయినాబాద్‌ మండలం అజీజ్‌నగర్‌ సమీపంలో ఉన్న ఎస్‌ఎస్‌ఆర్‌ క్రికెట్‌ అకాడమీలో మంగళవారం జూనియర్, సీనియర్‌ విభాగంలో రీజినల్‌ స్థాయి ఫైనల్‌ మ్యాచ్‌లు జరిగాయి. అనంతరం ఏర్పాటు చేసిన బహుమతుల ప్రదానోత్సవానికి శంషాబాద్‌ డీసీపీ ప్రకాష్‌రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. క్రీడాకారులను గుర్తించేందుకు ‘సాక్షి’ చేస్తున్న కృషి అభినందనీయమని అన్నారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రాల్లో 676 జట్లతో ‘సాక్షి’ ప్రీమియర్‌ లీగ్‌ నిర్వహించడం భేష్‌ అన్నారు.   


యువతను ప్రోత్సహిస్తున్న ‘సాక్షి’  
‘సాక్షి’ మీడియా గ్రూప్‌ విద్యార్థులు, యువతను ప్రోత్సహించేందుకు అనేక రకాల ఈవెంట్స్‌ నిర్వహిస్తోందని, అందులో ఎస్‌పీఎల్‌ ఒకటని సాక్షి కార్పొరేట్‌ కమ్యూనికేషన్‌ డైరెక్టర్‌ రాణిరెడ్డి అన్నారు. అనంతరం.. జిల్లా స్థాయి, రీజినల్‌ స్థాయిలో విన్నర్స్, రన్నర్స్‌ జట్టకు డీసీపీ ప్రకాష్‌రెడ్డి చేతులమీదుగా బహుమతులు అందజేశారు. జూనియర్‌ విభాగంలో జిల్లాస్థాయిలో విజయం సాధించిన భవన్స్‌ శ్రీఅరబిందో జూనియర్‌ కాలేజ్‌ ఏ జట్టు, రన్నర్‌గా నిలిచిన భవన్స్‌ శ్రీఅరబిందో జూనియర్‌ కాలేజీ బి జట్లకు, సీనియర్‌ విభాగంలో జిల్లాస్థాయి విజయం సాధించిన భవన్స్‌ వివేకానంద డిగ్రీ కాలేజ్‌ జట్టు, రన్నర్‌గా నిలిచిన సర్దార్‌పటేల్‌ డిగ్రీ కాలేజ్‌ జట్లకు బహుమతులు అందించారు. రీజినల్‌ స్థాయిలో జూనియర్‌ విభాగంలో విజయం సాధించిన భవన్స్‌ శ్రీఅరబిందో జూనియర్‌ కాలేజ్‌ జట్టు, రన్నర్‌గా నిలిచిన మహబూబ్‌నగర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల జట్టుకు, సీనియర్‌ విభాగంలో విజేతగా నిలిచిన భవన్స్‌ వివేకానంద డిగ్రీ కాలేజ్‌ జట్టు, రన్నర్‌గా నిలిచిన మహబూబ్‌నగర్‌ విద్యా సమితి(ఎంవీఎస్‌) డిగ్రీ కాలేజ్‌ జట్టుకు ట్రోఫీ, 
సరి్టఫికెట్లు, నగదు బహుమతులు అందజేశారు. 


జూనియర్, సీనియర్‌లో భవన్స్‌ విజయం
రీజినల్‌ స్థాయిలో మంగళవారం జరిగిన జూనియర్, సీనియర్‌ విభాగాల్లో భవన్స్‌ జట్లు విజయం సాధించాయి. మొదట జరిగిన జూనియర్‌ విభాగం మ్యాచ్‌లో మహబూ బ్‌నగర్‌ ప్రభుత్వ జూనియర్‌ కళాశాల జట్టు, భవన్స్‌ శ్రీఅరబిందో జూనియర్‌ కాలేజ్‌ జట్లు తలపడ్డాయి. మొదట బ్యాటింగ్‌ చేసిన మహబూబ్‌నగర్‌ జట్టు  94 పరుగులు చేసింది. 95 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భవన్స్‌ జట్టు 97 పరుగులు చేసి టైటిల్‌ గెలుచుకుంది. 
సీనియర్‌ విభాగంలో.. 
రీజినల్‌ స్థాయిలో సీనియర్‌ విభాగం మ్యాచ్‌ భవన్స్‌ వివేకానంద డిగ్రీ కాలేజ్, మహబూబ్‌నగర్‌ విద్యా సమితి(ఎంవీఎస్‌) డిగ్రీ కాలేజట్‌ జట్ల మధ్య జరిగింది. మొదట బ్యాటింగ్‌కు దిగిన భవన్స్‌ జట్టు 155 పరుగులు చేసింది. తర్వాత బ్యాటింగ్‌కు దిగిన ఎంవీఎస్‌ జట్టు 85 పరుగులే చేసింది. దీంతో భవన్స్‌ విజయాన్ని అందుకుని ట్రోఫీని గెలుచుకుంది.

( చదవండి: వామ్మో.. రోజుకు లక్ష కేసులు తాగేస్తున్నారు! )  

మరిన్ని వార్తలు