దివ్యాంగులకు 5 శాతం ‘డబుల్‌’ ఇళ్లు

26 Jan, 2021 11:38 IST|Sakshi

పరికరాలకు దరఖాస్తుల స్వీకరణ: మంత్రి కొప్పుల  

సాక్షి, హైదరాబాద్‌: డబుల్‌ బెడ్‌రూమ్‌ పథకంలో దివ్యాంగులకు 5 శాతం ఇళ్లు కేటాయిస్తామని మంత్రి కొప్పుల ఈశ్వర్‌ వెల్లడించారు. దివ్యాంగుల పరికరాల పంపిణీ ఏర్పాట్లపై సోమవారం హైదరాబాద్‌లో వికలాంగుల సహకార సంస్థ చైర్మన్‌ వాసుదేవరెడ్డితో కలసి విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దివ్యాంగుల సంక్షేమానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ తీసుకుంటుందని, విద్య, ఉపాధి పథకాల్లో 5 శాతం, ఉద్యోగాల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పిస్తున్నట్లు తెలిపారు. ప్రస్తుతం దివ్యాంగులకు పరికరాలను అందిస్తున్నామని, ఇందుకు సంబంధించి దరఖాస్తులు ఓబీఎంఎంఎస్‌ వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ పద్ధతిలో ఫిబ్రవరి ఆరో తేదీ వరకు స్వీకరిస్తామని పేర్కొన్నారు. ఎంపికైన లబ్ధిదారులకు ఫిబ్రవరి 15 నుంచి పరికరాలను అందజేయనున్నట్లు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు