సీఎం కావాలన్నదే ‘ఎంపీ సంతోష్‌’ కోరిక.. 5 వేల కోట్లకు అధిపతి ఎలా అయ్యాడు?

20 Jul, 2021 08:03 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: మిడ్‌మానేరు ముంపు గ్రామమైన కొదురుపాకలో బీపీఎల్‌ కోటా కింద పరిహారం పొందిన ఎంపీ సంతోష్‌ నేడు రాష్ట్ర ప్రభుత్వాన్ని శాసించే స్థాయికి ఎదిగాడని.. అధికారంపై ఆ కాంక్షతో కుటుంబ సభ్యులను సైతం విడదీసి ప్రగతి భవన్‌లో పెత్తనం సాగిస్తున్న సంతోష్‌ రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రి పీఠానికి ఎసరు పెట్టాడని మాజీ ఎమ్మెల్యే, ఆర్టీసీ మాజీ చైర్మ న్‌ గోనె ప్రకాశ్‌రావు ఆరోపించారు. సోమవారం ఆయన కరీంనగర్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు.

అధికారం అడ్డుపెట్టుకొని అక్రమాలకు పాల్పడుతుంటే, ప్రశ్నించిన వారిని బెదిరింపులు భయబ్రాంతులకు గురిచేస్తూ, రాజ్యసభ సభ్యుడు సంతోష్‌ కుమార్‌ పోలీసులతో కేసులు నమోదు చే యిస్తున్నాడని పేర్కొన్నారు.  నాడు చెప్పులు లేకుండా ఉన్న ఆయన నేడు ఐదారు వేల కోట్లకు ఎలా అధిపతి అయ్యాడని ప్రశ్నించారు. కొదురుపాకలో తన కుటుంబం చేస్తున్న అక్రమ ఇసుక దందాతో నష్టపోతున్న అమాయకుల పట్ల వ్యవహరిస్తున్న తీరు హేయమని అన్నారు.

నాడు కుటుంబం గడిచేందుకే కష్టపడిన సంతోష్‌ తండ్రి రవీందర్‌రావు.. నేడు వేల కోట్లు ఎలా సంపాదించారని ప్ర శ్నించారు. తాను చేస్తున్న అక్రమ దందాకు సహకరించడం లేదంటూ 30 మంది పై అట్రాసిటీ కేసులు, ఇతరత్రా కేసులు బనాయించారని మండిపడ్డారు. గ్రీన్‌ ఛాలెంజ్‌ పేర మొక్కలు నాటుతున్న సంతోష్‌ జిల్లాల్లో పర్యటిస్తూ తన వర్గాన్ని తయారు చేసుకుంటున్నాడని ఆరోపించారు. నిన్నామొన్నటిదాకా హరీశ్, కేటీఆర్‌ల మధ్య అంతర్గత విభేదాలు ఉండగా, తాజాగా అన్నదమ్ముల మధ్య కోల్డ్‌వార్‌ కొనసాగుతోందన్నారు.

ప్రగతి భవన్‌కు రావాలంటే మంత్రి కేటీఆర్, ఎమ్మెల్సీ కవిత కూడా సంతోష్‌ అనుమతి తీసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. ఇంటెలిజెన్స్‌ వ్యవస్థను కూడా శాసిస్తున్న ఆయన.. రాష్ట్రానికి ప్రమాదకరంగా తయారయ్యాడని అన్నారు. కొ దురుపాకలో భూ నిర్వాసితుల కోటాలో తాను, తన తండ్రి వ్యవసాయ కూలీ కింద రూ.2 లక్షల చొప్పున లబ్ధి పొందటంతో పాటు, తన బాబాయ్‌ గండ్ర ర మణారావు, కూతురు సౌమ్యలకు కూడా రూ.53 వే ల చొప్పున లబ్ధి చేకూర్చాడని విమర్శించారు.

ఆ గ్రామంలో 4,231 మందికి పరిహారం చెల్లించాల్సి ఉండగా, కేవలం ఆయన సూచించిన 100 మందికి మాత్రమే వచ్చిందన్నారు. కొదురుపాక నుంచి నిత్య ం 150 ట్రాక్టర్లలో ఇసుక తరలిస్తుండగా, ఒక్కో ట్రా క్టర్‌కు నెలకు రూ.13,500 చొప్పున మామూళ్లు వ సూలు చేస్తున్నారని పేర్కొన్నారు. హుజూరాబాద్‌ ఉప ఎన్నికలో ఈటల రాజేందర్‌కు తమ మద్దతు ఉంటుందని స్పష్టం చేశారు.  

    

మరిన్ని వార్తలు