గ్రూప్‌-2 వాయిదా వేయాల్సిందే.. టీఎస్పీఎస్సీని ముట్టడించిన అభ్యర్థులు

24 Jul, 2023 13:57 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: గ్రూప్‌-2 అభ్యర్థులు తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కార్యాలయాన్ని సోమవారం ముట్టడించారు. ఆగష్టు 29, 30తేదీల్లో గ్రూప్‌-2 పరీక్ష జరగాల్సి ఉంది. అయితే ఈ పరీక్షలను వాయిదా వేయాలని అభ్యర్థులు కార్యాలయాన్ని ముట్టడించడంతో ఉద్రిక్తత చోటు చేసుకోగా.. భారీగా ట్రాఫిక్‌ ఝామ్‌ అయ్యింది.

ఇప్పటికే గ్రూప్ - 1 ప్రిలిమ్స్, గ్రూప్ 4 వంటి పరీక్షలను పూర్తి చేయగా.... గ్రూప్ - 2 నిర్వహణకు ఏర్పాట్లు సిద్ధం చేస్తోంది.  పేపర్‌ లీకేజీ వ్యవహారంతో బోర్డు ప్రతిష్ట మసకబారిపోగా.. ఇక నుంచైనా అప్రమత్తంగా ఉండాలని భావిస్తోంది.  

గ్రూప్-2 ప‌రీక్షా కేంద్రాలకు కేటాయించిన ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు కాలేజీలు, స్కూళ్ల‌కు సెల‌వులు ప్ర‌క‌టిస్తూ ప్ర‌భుత్వం ఉత్త‌ర్వులు జారీ చేసింది. ఆరోజుల్లో మిగ‌తా ప్ర‌భుత్వ‌, ప్ర‌యివేటు స్కూల్స్, కాలేజీలు య‌ధావిధిగా  న‌డుస్తాయ‌ని స్ప‌ష్టం చేసింది.

మరోవైపు.. జీవో నెంబర్‌ 46 రద్దు కోరుతూ డీజీపీ కార్యాలయం ఎదుట కానిస్టేబుల్‌ అభ్యర్థులు సైతం ధర్నా చేపట్టారు. దీంతో భారీగా ట్రాఫిక్‌ జామ్‌ అయ్యింది. 

మరిన్ని వార్తలు