ప్రభుత్వ భూముల కబ్జాపై 33 జిల్లాల్లో వెంటనే సర్వే చేపట్టాలి​: హైకోర్టు

4 Aug, 2021 17:36 IST|Sakshi

హైదరాబాద్‌: ఓయూ భూములు కబ్జా అవుతున్నాయన్న ఓయూ విద్యార్థి పి.రమణారావు లేఖపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. సుమారు 3 వేలకు గజాలకుపైగా భూమిని అక్రమ రిజిస్ట్రేషన్‌ చేసి ఆక్రమిస్తున్నారని పి.రమణారావు లేఖలో హైకోర్టుకు తెలిపాడు. అయితే కబ్జా కాకుండా చర్యలు తీసుకున్నట్లు ఏజీ తెలిపింది. తులసి హౌజింగ్‌ సొసైటీపై పోలీసులకు ఓయూ ఫిర్యాదు చేసిందని ఏజీ  తెలిపింది. ఇక దర్యాప్తు ఏ స్థాయిలో ఉందో నివేదిక సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. అంతేకాకండా హైదరాబాద్‌ సీపీ, అంబర్‌పేట పోలీసులను హైకోర్టు ప్రతివాదులుగా చేర్చింది. దీనిపై తదుపరి విచారణ అక్టోబర్‌ 20కి వాయిదా వేసింది. 

వీధి కుక్కలకు వ్యాక్సినేషన్‌..!
వీధి కుక్కలకు వ్యాక్సినేషన్‌, స్టెరిలైజేషన్‌కు చర్యలు తీసుకోవాలని హైకోర్టు ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీధికుక్కల నియంత్రణపై జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ విజయ్‌సేన్‌రెడ్డి ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టారు. వీధికుక్కల నియంత్రణకు చర్యలపై కలెక్టర్లు నివేదికలు సమర్పించకపోవడంపై అసహనం వ్యక్తం చేశారు. నాలుగు వారాల్లో 33 జిల్లాల కలెక్టర్లను నివేదికలు సమర్పించాలని హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. నివేదికలు సమర్పించని కలెక్టర్లపై కోర్టు ధిక్కరణ చర్యలు చేపడతామని హైకోర్టు హెచ్చరించింది.

3 వారాల్లో నియమించి నోటిఫికేషన్‌ ఇవ్వాలి: తెలంగాణ హైకోర్టు
తెలంగాణ బీసీ కమిషన్‌ ఛైర్మన్‌, సభ్యుల నియామకంపై హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. సీజే జస్టిస్‌ హిమా కోహ్లి, జస్టిస్‌ విజయసేన్‌రెడ్డి ధర్మాసనం విచారణ చేపట్టారు.
కాగా, మరో 4 వారాల సమయం కావాలని హైకోర్టును ప్రభుత్వం కోరింది. అయితే 3 వారాల్లో నియమించి నోటిఫికేషన్‌ ఇవ్వాలని ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. 
తదుపరి విచారణ సెప్టెంబర్‌ 25కి వాయిదా వేశారు.

హెల్మెట్‌ ఫైన్‌ల విధింపుపై హైకోర్టు విచారణ 
వాహనం వెనుక కూర్చున్న వ్యక్తికి.. హెల్మెట్‌ ఫైన్‌ల విధింపుపై తెలంగాణ హైకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. కేంద్ర మోటార్‌ వాహనాల చట్ట సవరణను రాష్ట్రం స్వీకరించకముందే ఫైన్‌లు విధిస్తున్నారన్న పిటిషనర్‌ పేర్కొన్నాడు. అయితే దీనికి సంబంధించిన వివరాలను తెలపాలని ప్రభుత్వ న్యాయవాదిని హైకోర్టు ఆదేశించింది. తదుపరి విచారణ సెప్టెంబర్‌ 2కి వాయిదా వేసింది.

33 జిల్లాల్లో వెంటనే సర్వే చేపట్టాలన్న హైకోర్టు
తెలంగాణలో ప్రభుత్వ భూములను గుర్తించాలని హైకోర్టు ఆదేశించింది. ప్రభుత్వ భూముల అక్రమాలకు సంబంధించి ఫిర్యాదులు తరచూ తమ దృష్టికి వస్తున్నట్లు హైకోర్టు తెలిపంది. రాష్ట్రంలోని 33 జిల్లాల్లో వెంటనే సర్వే చేపట్టాలని ప్రభుత్వానికి  హైకోర్టు  ఆదేశాలు జారీ చేసింది. తదుపరి విచారణ అక్టోబర్‌ 27కి వాయిదా వేసింది.

మరిన్ని వార్తలు