Hyderabad Liberation Day 2022: విమోచన వేడుకలు తెలంగాణ ప్రజల విజయం.. అమిత్‌ షా అభివన సర్దార్‌ పటేల్‌: కిషన్‌రెడ్డి

17 Sep, 2022 10:00 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ ప్రజలకు ఇవాళ పండుగ రోజు అని పేర్కొన్నారు బీజేపీ సీనియర్‌ నేత, ఎంపీ.. కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి.  శనివారం సికింద్రాబాద్‌ పరేడ్‌ గ్రౌండ్‌లో ఘనంగా జరిగిన తెలంగాణ విమోచన వేడుకల్లో ఆయన పాల్గొని ప్రసంగించారు. 

నిజాం పాలనలో తెలంగాణ ప్రజలు బలైపోయారు. అప్పుడు.. హైదరాబాద్‌లో తొలిసారిగా సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ జెండా ఎగరేశారు. మళ్లీ 74 ఏళ్ల తర్వా త మళ్లీ అమిత్‌ షా వచ్చి త్రివర్ణ పతాకం ఎగరేశారు.  అమిత్‌ షా అభినవ సర్దార్‌ పటేల్‌ అని అభివర్ణించారు కిషన్‌ రెడ్డి.  పాతికేళ్లుగా ఈ వేడుకలు నిర్వహించాలని ప్రయత్నిస్తున్నాం. ఇప్పుడు.. బీజేపీ పోరాటంతోనే విమోచన దినోత్సవం జరుపుకుంటున్నాం అని కిషన్‌రెడ్డి ప్రకటించుకున్నారు. 

తెలంగాణ ప్రజలకు ఇవాళ పండుగ రోజన్న ఆయన.. టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం తూతూమంత్రంగా వేడుకలు జరుపుతోందని మండిపడ్డారు. అసలు ఇన్నిరోజులు ఎందుకు నిర్వహించలేదని కేసీఆర్‌ సర్కార్‌ను ప్రశ్నించారాయన. సెప్టెంబర్‌ 17 సందర్భంగా.. కేంద్రం ఆధ్వర్యంలో ఇవాళ తెలంగాణ వ్యాప్తంగా విమోచన వేడుకలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా.. పరేడ్‌ గ్రౌండ్‌ వేడుకల్లో పాల్గొన్న అమిత్‌ షా.. జాతీయ జెండా ఎగరేసి, అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. అనంతరం సర్దార్‌ వల్లభాయ్‌ పటేల్‌ విగ్రహానికి నివాళులర్పించారు.

ఇదీ చదవండి: విలీన విషయంలో వివాదాలు వద్దు-వెంకయ్యనాయుడు

మరిన్ని వార్తలు