‘మునుగోడు’ హామీలను వెంటనే అమలు చేయండి.. కేసీఆర్ ఆదేశం

8 Nov, 2022 02:02 IST|Sakshi

మంత్రులు, ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలకు సీఎం కేసీఆర్‌ ఆదేశం

అధికారుల సమన్వయంతో పనులన్నీ చేపట్టాలని సూచన

ప్రగతిభవన్‌లో కేసీఆర్‌ను కలిసిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి

మునుగోడు గెలుపు కోసం పనిచేసిన నేతలకు సీఎం అభినందనలు

సాక్షి, హైదరాబాద్‌: మునుగోడు ఉప ఎన్నిక సందర్భంగా ప్రజ లకు ఇచ్చిన హామీలను వెంటనే ఆచరణలో పెట్టాలని మంత్రు లు, ఉమ్మడి నల్లగొండ జిల్లా టీఆర్‌ఎస్‌ నేతలను సీఎం కె.చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. సంబంధిత శాఖల మంత్రులు, అధికారులతో సమన్వయం చేసుకుంటూ ప్రణాళికలు అమల య్యేలా చూడాలని సూచించారు. మునుగోడు ఉప ఎన్నికలో గెలిచిన కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి, ఉమ్మడి నల్లగొండ జిల్లా నేతలు సోమవారం ప్రగతిభవన్‌లో సీఎం కేసీఆర్‌ను మర్యాద పూర్వకంగా కలిశారు.

ఈ సందర్భంగా సోమవారం మధ్యా హ్నం సుమారు మూడు గంటల పాటు ఉమ్మడి నల్లగొండ జిల్లా ప్రజాప్రతినిధులు, ముఖ్య నేతలతో సీఎం కేసీఆర్‌ సమావేశ మయ్యారు. మునుగోడు అభివృద్ధికి సంబంధించిన పలు అంశా లపై దిశానిర్దేశం చేశారు. ‘‘ఎన్నికల సమయంలో నేతలు కేవలం హామీలు ఇస్తారనే అపోహను తొలగించాల్సిన అవసరం ప్రజా ప్రతినిధులపై ఉంది. మునుగోడు ఉప ఎన్నిక ప్రచారం సందర్భ ంగా నియోజకవర్గంలో రీజనల్‌ హాస్పిటల్, రెవెన్యూ డివిజన్‌ ఏర్పాటు, రోడ్ల నిర్మాణం వంటి అనేక అంశాలపై ప్రజల నుంచి విజ్ఞప్తులు అందాయి.

త్వరలో మంత్రి జగదీశ్‌రెడ్డి నేతృత్వంలో ఒక తేదీని నిర్ణయించుకుని పంచాయతీరాజ్, రోడ్లు– భవనాలు, నీటి పారుదల, గిరిజన సంక్షేమం తదితర శాఖలకు చెందిన మంత్రులు మునుగోడుకు వెళ్లండి. జిల్లా కలెక్టర్, సంబంధిత శాఖల అధికారులతో నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వ హించి, అవసరమైన పనులకు ప్రణాళికలు సిద్ధం చేయండి. చర్ల గూడెం, శివన్నగూడెం రిజర్వాయర్ల పనుల పురోగతిని సమీ క్షించండి..’’ అని సీఎం కేసీఆర్‌ సూచించినట్టు తెలిసింది. ఇప్ప టికే నల్లగొండ జిల్లాలో టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాల ప్రభావం కనిపిస్తోందని పేర్కొన్నట్టు సమాచారం.

కూసుకుంట్లకు అభినందన
మునుగోడు ఉప ఎన్నికలో తనకు టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా అవకాశమిచ్చిన సీఎం కేసీఆర్‌కు కూసుకుంట్ల ప్రభాకర్‌రెడ్డి కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా కూసుకుంట్లకు శుభాకాంక్షలు తెలిపిన సీఎం కేసీఆర్‌ శాలువాతో సత్కరించారు. ఆయనతోపాటు మునుగోడులో విజయం కోసం కృషి చేసిన పార్టీ నేతలను అభినందించారు. సీఎంను కలిసినవారిలో మంత్రి జగదీశ్‌రెడ్డి, ఎమ్మెల్యేలు గ్యాదరి కిశోర్, కంచర్ల భూపాల్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, గొంగిడి సునీత, బొల్లం మల్లయ్యయాదవ్, ఆశన్నగారి జీవన్‌రెడ్డి, పైళ్ల శేఖర్‌రెడ్డి, సైదిరెడ్డి, రవీంద్రకుమార్‌ నాయక్, భాస్కర్‌రావు, ఎమ్మెల్సీలు పల్లా రాజేశ్వర్‌రెడ్డి, ఎగ్గె మల్లేశం, ఎంసీ కోటిరెడ్డి, పార్టీ నేత సోమభరత్‌ కుమార్, ఉమా మాధవరెడ్డి తదితరులు ఉన్నారు.
చదవండి: ఫోన్‌ ట్యాపింగ్‌పై భారీగా ఫిర్యాదులు?

మరిన్ని వార్తలు