భారత విద్యార్థులకు భరోసా ఇవ్వండి: కేటీఆర్‌

25 Feb, 2022 05:03 IST|Sakshi

విపత్కర పరిస్థితుల్లో ఉక్రెయిన్‌లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులు సురక్షితంగా ఉండేలా చూడాలని విదేశాంగ మంత్రి జైశంకర్‌కు మంత్రి కేటీఆర్‌ ట్విట్టర్‌ ద్వారా విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఎన్నో విజ్ఞప్తులు వస్తున్నాయని, ఉక్రెయిన్‌లోని భారతీయులను కాపాడేందుకు దౌత్య మార్గాల ద్వారా చర్యలు చేపట్టాలని కోరారు.

ఇక ఉక్రెయిన్‌లో చిక్కుకున్న తెలంగాణ విద్యార్థులను సురక్షితంగా స్వదేశానికి తీసుకురావాలంటూ టీఆర్‌ఎస్‌ ఎంపీ రంజిత్‌రెడ్డి విదేశాంగ శాఖకు లేఖ రాశారు. కాగా.. సికింద్రాబాద్‌ మైలార్‌గడ్డకు చెందిన మెడికో అనీల ఉక్రెయిన్‌లో చిక్కుకుందని, క్షేమంగా తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేయాలని ఆమె తండ్రి మనోహర్‌బాబు మంత్రి కేటీఆర్, డిప్యూటీ స్పీకర్‌ పద్మారావులను కలిసి విజ్ఞప్తి చేశారు. 

మరిన్ని వార్తలు