కరీంనగర్‌లో హోలీ వేడుకలు.. మంత్రి గంగుల కమలాకర్‌ డీజే స్టెప్పులు

18 Mar, 2022 14:01 IST|Sakshi

సాక్షి, కరీంనగర్‌: కరీంనగర్‌లో హోళీ సంబరాలు ఘనంగా జరుగుతున్నాయి. గత రెండేళ్లు కరోనా కారణంగా ఉన్న హోలీ వేడుకలకు దూరంగా ఉన్న జనం ఈసారి చాలా ఉత్సాహంగా సెలబ్రేషన్ చేసుకుంటున్నారు. కాలనీల్లో, ఇళ్లల్లో ఎక్కడా చూసినా రంగులు చల్లుకుంటూ పండుగను ఎంజాయ్ చేస్తున్నారు.  

కరీంనగర్‌ గీతా భవన్‌ చైరస్తాలో టీఆర్‌ఎస్‌ నాయకులు హోళీ సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్‌, మేయర్‌ సునీల్‌రావు, టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్లు పాల్గొన్నారు. హోళీ సంబరాలలో భాగంగా మంత్రి గంగుల కమలాకర్ అందరితో కలిసి ఉత్సాహంగా డ్యాన్స్‌ చేశారు.  డీజే పాటలకు స్టెప్పులు వేశారు.
చదవండి: అంబరాన్నంటిన హోలీ సంబరాలు: వైరల్‌ వీడియోలు

మరిన్ని వార్తలు