కార్గో పార్శిల్‌ హోం డెలివరీని ప్రారంభించిన పువ్వాడ

10 Dec, 2020 13:11 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: కార్గో పార్శిల్‌ సేవలు ప్రారంభమై ఏడాది అవుతుందని రవాణా శాఖ మంత్రి అజయ్‌ పువ్వాడ తెలిపారు. ఖైరతాబాద్‌లోని ట్రాన్స్‌పోర్టు భవన్‌లో కార్గో హోం డెలివరీ సేవలను మంత్రి అంజయ్‌, అర్జీసీ అధికారులు గురువారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. కార్గో పార్శిల్‌ సేవలు ప్రారంభమైనప్పటి నుంచి పన్నెండున్నర లక్షల పార్శిళ్లను చేరవేశామని పేర్కొన్నారు. పదకొండున్నర కోట్ల ఆదాయం ఇప్పటి వరకు వచ్చిందని, ఆ తర్వాత రోజు 25 లక్షల ఆదాయం వస్తుందని వివరించారు. కూకట్‌పల్లి, జేబీఎస్‌, ఎంజీబీఎస్‌ నుంచి హోం డెలీవరి ప్రారంభిస్తున్నామని ఆయన చెప్పారు.

అక్యూపెన్సి కూడా పెరిగిందని, ప్రయాణికులు కూడా పాండమిక్‌ని మర్చిపోయి బస్సులను ఆదిరిస్తున్నారన్నారు. అంతరాష్ట్ర బస్సులు కూడా పూర్తిగా నడుస్తున్నాయని, కష్టకాలంలో రూ. 200 కోట్లు ఇచ్చిన సీఎం కేసీఆర్‌ ఆర్టీసీని ఆదుకున్నారన్నారు. సీఎం  కేసీఆర్‌ మొత్తం 1200 కోట్ల రూపాయలను ఆర్టీసీకి చేయూతనిచ్చారని తెలిపారు. కార్గో ప్రారంభమైనప్పటి నుంచి ఒక్కసారి కూడా పార్శిల్‌లు మిస్‌ కావడం కానీ డ్యామేజ్‌ కావడం లాంటివి జరగీలేదన్నారు. ప్రస్తుతం కార్గోలో ఎజెంట్స్‌ కూడా పెరిగారని, మరిన్ని సేవల కోసమే హోం డెలివరీని ప్రారంభించిస్తున్నామని ఆయన స్పష్టం చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల జీతాలు ఒకటి రెండు రోజులు ఆలస్యమైనా అందిరికి ఇస్తున్నామని.. ఎక్కడ ఇబ్బంది లేదని మంత్రి చెప్పారు. 

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు