మంద కృష్ణకు గాయాలు 

9 Aug, 2021 04:10 IST|Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్రమంత్రుల్ని కలవడానికి ఢిల్లీకి వచ్చిన ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపకుడు మంద కృష్ణమాదిగకు గాయాలయ్యాయి. ఎంపీల అతిథిగృహం వెస్ట్రన్‌ కోర్టులో బస చేసి న ఆయన ఆదివారం ఉదయం స్నానాలగదిలో పడిపోయారు. కుడికాలుకు తీవ్ర గాయం కావడంతో ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చగా వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మంద కృష్ణను కేంద్ర పర్యాటక మంత్రి కిషన్‌రెడ్డి పరామర్శించారు.

మరిన్ని వార్తలు