తక్కువ ధరకే ఐఫోన్‌ వస్తుందని.. ఫోన్‌పే ద్వారా రూ. లక్ష పంపాడు.. తీరా చూస్తే

21 Sep, 2022 16:24 IST|Sakshi

సాక్షి, నిజామాబాద్‌: ఆన్‌లైన్‌లో పరిచయమైన వ్యక్తి తక్కువ ధరకే ఆపిల్‌ ఐఫోన్‌ అమ్ముతానని చెప్పిన మాటల వలలో పడి ఓ యువకుడు మోసపోయిన ఘటన ధర్పల్లిలో చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన చింతనాల్ల ప్రసాద్‌ ఈనెల 10న ఆన్‌లైన్‌లో ఎలక్ట్రానిక్‌ ఫ్లాట్‌ ఫాంలో రషీ ద్‌ అనే వ్యక్తితో పరిచయం ఏర్పడింది. తక్కువ ధరకే ఆపిల్‌ ఐఫోన్‌ అమ్ముతానని చెప్పడంతో బాధితుడు నమ్మి ఫోన్‌ పే ద్వారా రూ. లక్ష పంపించారు.

చివరికి ఫోన్‌ డెలివరీ అయిన తర్వాత నకిలీ ఫోన్‌గా గుర్తించిన బాధితుడు పోలీస్‌స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఎస్సై వంశీకృష్ణారెడ్డి తెలిపారు. సందర్భంగా ఎస్సై మాట్లాడు తూ బాధితుడు ఫిర్యాదు మేరకు సైబర్‌ హెల్ప్‌ లైన్‌ నంబర్‌ ద్వారా అమౌంట్‌ ఫ్రీజ్‌ చేసినట్లు పేర్కొన్నారు. సైబర్‌ కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేపడతామని వెల్లడించారు. 

మరిన్ని వార్తలు