ప్రీతి కేసు: కోర్టుకు సైఫ్‌.. డీజీపీ ఆఫీసుకు ప్రీతి పేరెంట్స్‌

6 Mar, 2023 12:50 IST|Sakshi

సాక్షి, వరంగల్‌: ప్రీతి కేసు తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన విషయం తెలిసిందే. కాగా, ఈ కేసులో నిందితుడు సైఫ్‌ను సోమవారం.. పోలీసులు మెజిస్ట్రేట్‌ ముందు హాజరుపరిచారు. 

ఈ సందర్బంగా ప్రీతి మృతి కేసులో సైఫ్‌.. పోలీసు కస్టడీని పొడిగించాలని కోరుతూ పోలీసులు కోర్టును ఆశ్రయించారు. ఈ క్రమంలో కోర్టు పోలీసుల పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది. ఇక, ఇప్పటి వరకు ఇచ్చిన నాలుగు రోజుల పోలీసు కస్టడీ నిన్నటితో ముగిసింది. ఈ క్రమంలో రేపటి విచారణ ఉన్న కారణంగా సైఫ్‌ మళ్లీ ఖమ్మం జైలుకు తరలించారు. 

ఇదిలా ఉండగా, ప్రీతి కేసు విషయమై.. తెలంగాణ డీజీపీ ఆఫీసుకు ప్రీతి కుటుంబ సభ్యులు వచ్చారు. ప్రీతి కేసు గురించి డీజీపీ అంజనీ కుమార్‌తో వారు చర్చించారు. అనంతరం, ప్రీతి తండ్రి నరేందర్‌ మీడియాతో మాట్లాడుతూ.. ‘ప్రీతిది ఆత్మహత్య కాదు.. హత్యే. ప్రీతి మృతిపై సమగ్ర విచారణ చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నాము. టాక్సికాలజీ రిపోర్టు మాకు ఇవ్వలేదు. నిందితులకు తగిన శిక్ష పడేలా చూడాలి. కఠినంగా శిక్షించాలి. బ్లడ్‌ ఎక్కించిన తర్వాత శాంపుల్స్‌ను టాక్సికాలజీ కోసం పంపించారు. అప్పటికే డయాలసిస్‌ కూడా పూర్తి అయ్యింది’ అని అన్నారు. 

మరిన్ని వార్తలు