స్పా ముసుగులో వ్యభిచారం: ఏడుగురి రిమాండ్‌ 

2 Sep, 2021 08:16 IST|Sakshi
పోలీసుల అదుపులో నిర్వాహకులు

కేపీహెచ్‌బీకాలనీ: స్పా ముసుగులో వ్యభిచా రం నిర్వహిస్తున్న నిర్వాహకులను కేపీహెచ్‌బీ పోలీస్‌లు రిమాండ్‌కు తరలించారు. సీఐ లక్ష్మీనారాయణ వివరాల ప్రకారం.. కేపీహెచ్‌బీ కాలనీ రోడ్డు నెంబర్‌–1లోని ఆర్‌ఏ స్పా అండ్‌ మసాజ్‌ పేరుతో వ్యభిచార కేంద్రాన్ని నిర్వహిస్తున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు బుధవారం కేంద్రంపై దాడిచేసి నిర్వాహకుడు సయ్యద్‌ అక్బర్‌ అలీతో ఆయనకు సహకరిస్తున్న మరో ఆరుగురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. వీరితో పాటు పట్టుబడిన ముగ్గురు మహిళలను రెస్క్యూ హోంకు తరలించారు.  

చదవండి:  బంజారాహిల్స్‌: బ్యూటీ అండ్‌ స్పా పేరుతో వ్యభిచారం.. నలుగురు అరెస్ట్‌
Cyber Crime: అమెరికా వెళ్లాకే పెళ్లి అని, 22 లక్షలు కొట్టేశాడు!

మరిన్ని వార్తలు