పెళ్లై 15 నెలలు.. సంతానం లేదని కానిస్టేబుల్‌..

29 Jun, 2021 14:33 IST|Sakshi

ఉరేసుకుని కానిస్టేబుల్‌ బలవన్మరణం

సాక్షి,రాజేంద్రనగర్‌: వివాహం జరిగి 15నెలలు గడుస్తున్నా సంతానం కలగడం లేదని భార్యాభర్తల మధ్య గొడవ జరగడంతో మనస్తాపం చెందిన భర్త ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న సంఘటన రాజేంద్రనగర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం... నేషనల్‌ పోలీస్‌ అకాడామీలో వాసు(30) కానిస్టేబుల్‌గా విధులు నిర్వహిస్తున్నాడు. వాసుకు  15నెలల కిందట నీలిమతో వివాహం జరిగింది. సంతానం కలగడం లేదని తరుచూ భార్యాభర్తల మధ్య గొడవజరుగుతుంది.

ఇదే విషయమై ఆదివారం రాత్రి ఇరువురి మధ్య మరోసారి గొడవయింది. రాత్రి 9గంటల ప్రాంతంలో ఇరువురు నిద్రకు ఉపక్రమించారు.11గంటల ప్రాంతంలో నీలిమకు మెలుకువ రావడంతో బెర్రంలో చూడగా వాసు ఉరేసుకుని వేలాడుతూ కనిపించాడు. దీంతో ఆమె విషయాన్ని కుటుంబ సభ్యు కు, చుట్టు పక్కల వారికి తెలిపింది. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పంచనామా నిర్వహించి మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.  

చదవండి: భార్య అకౌంట్‌ నుంచి రూ.కోటి విత్‌ డ్రా.. టీవీ నటుడిపై కేసు

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు