గిరిజన రిజర్వేషన్లు పెంచండి

4 Sep, 2020 04:18 IST|Sakshi

కేంద్రానికి రాష్ట్రం తరఫున తీర్మానం సమర్పించాం 

నేషనల్‌ ట్రైబల్‌ రీసెర్చ్‌ కాన్‌క్లేవ్‌లో మంత్రి సత్యవతి రాథోడ్‌

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లు 6.5 శాతంగా ఉన్నాయని, జనాభా ప్రాతిపదికన పరిశీలిస్తే రిజర్వేషన్లు 9.08 శాతంగా ఉండాలని గిరిజన సంక్షేమ శాఖ మంత్రి సత్యవతి రాథోడ్‌ అన్నారు. ఇందుకు సంబంధించిన ప్రతిపాదనలు, రాష్ట్ర ప్రభుత్వ తీర్మానం కేంద్రానికి సమర్పించినట్లు స్పష్టం చేశారు. కేంద్ర ప్రభుత్వం ఆదేశిస్తే రాష్ట్రంలో గిరిజన రిజర్వేషన్లు పెంచుతామని పేర్కొన్నారు. కేంద్ర గిరిజన వ్యవహారాల శాఖ ఆధ్వర్యంలో గురువారం జరిగిన నేషనల్‌ ట్రైబల్‌ రీసెర్చ్‌ కాన్‌క్లేవ్‌లో మంత్రి వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి రిజర్వేషన్ల అంశంతో పాటు రాష్ట్రానికి మంజూరు చేసిన గిరిజన యూనివర్సిటీ ప్రారంభం అంశాన్ని కూడా ప్రస్తావించారు. కేంద్రం త్వరితంగా అనుమతులిస్తే వర్సిటీని అందుబాటులోకి తెస్తామన్నారు. రాష్ట్రంలో 50 శాతానికి పైగా గిరిజనులు ఉన్న ప్రాంతాల్లో ఏకలవ్య మోడల్‌ స్కూళ్లను మంజూరు చేయాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.  

మరిన్ని వార్తలు