నోట్ల రద్దు ‘అసంఘటితం’పై శరాఘాతం

4 Sep, 2020 04:09 IST|Sakshi

న్యూఢిల్లీ: నోట్ల రద్దు భారత అసంఘటిత రంగంపై దాడి అని, దీనిపై సమైక్యంగా పోరాడాల్సిన అవసరం ఉందని కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ వ్యాఖ్యానించారు. పెద్ద నోట్ల  రద్దు  నిర్ణయం దేశంలోని పేద ప్రజలు, రైతాంగం, అసంఘటిత రంగకార్మికులపై, చిన్నాచితకా దుకాణదారులపై తీవ్రమైన దాడి అని  ఆరోపించారు. సామాజిక మాధ్యమాల్లో రాహుల్‌ వెలువరిస్తోన్న వీడియో సిరీస్‌ ద్వితీయ భాగంలో ఆయన భారత ఆర్థిక వ్యవస్థపై మాట్లాడారు.

ప్రధాని  మోదీ  దేశాన్ని నగదు రహిత ఆర్థిక వ్యవస్థగా మార్చాలని భావిస్తున్నారని, కానీ పేదలు, రైతులు, కార్మికులు చిన్న వ్యాపారులు, అసంఘటితరంగ కార్మికులంతా నగదుపైనే ఆధారపడి ఉన్నారని రాహుల్‌ వ్యాఖ్యానించారు. మోదీ చెప్పినట్టు నోట్ల రద్దు కారణంగా నల్లధనం బయటకు రాలేదనీ, పేదప్రజలు లబ్ధిపొందిందీ లేదని, దీనివల్ల సంపన్నులకే మేలు జరిగిందని రాహుల్‌ అన్నారు.  

మరిన్ని వార్తలు