Traffic Free Tank Bund On Sundays: ట్యాంక్‌బండ్‌పై సండే సందడి 

6 Sep, 2021 08:33 IST|Sakshi

సాక్షి, కవాడిగూడ: ట్యాంక్‌బండ్‌పై ఆదివారం సాయంత్రం సందడి నెలకొంది. సాయంత్రం వేళ ట్యాంక్‌బండ్‌పై సందర్శకులకు అనుమతివ్వడంతో  హుస్సేన్‌సాగర్‌ అందాలను తిలకించేందుకు ఆసక్తి చూపుతున్నారు. చిన్నారులు సైకిలింగ్‌ చేస్తూ మురిసిపోయారు.
చదవండి: మహాగణపతి సిద్ధం.. ఖైరతాబాద్‌ చరిత్రలోనే తొలిసారి

 
కుటుంబసభ్యులతో డిప్యూటీ మేయర్‌   

ఆటవిడుపులో డిప్యూటీ మేయర్‌...
జీహెచ్‌ఎంసీ డిప్యూటీ మేయర్‌ మోతె శ్రీలతాశోభారెడ్డి కుటుంబసభ్యులతో కలిసి వచ్చారు. ఈ సందర్భంగా సందర్శకులతో మాట్లాడారు. నగర నడిబొడ్డున ఉన్న ట్యాంక్‌బండ్‌కు కుటుంబ సమేతంగా ఇలా రావడం పిక్‌నిక్‌ వచ్చినట్లుగా ఉందని డిప్యూటీ మేయర్‌ సంతోషాన్ని వ్యక్త పరిచారు. చిక్కడపల్లి ట్రాఫిక్‌ సీఐ ప్రభాకర్‌రెడ్డి భద్రతా ఏర్పాట్లు పర్యవేక్షించారు.  

మరిన్ని వార్తలు