పత్తికి పెద్దపీట

22 Jun, 2022 01:08 IST|Sakshi

ఈసారి సాగు విస్తీర్ణంలో దాదాపు సగం ఈ పంటే 

వానాకాలం సీజన్‌ ప్రణాళిక ప్రకటించిన వ్యవసాయ శాఖ 

సాక్షి, హైదరాబాద్‌: ఈసారి వానాకాలం సీజన్‌ సాగు విస్తీర్ణంలో దాదాపు సగం మేరకు పత్తి సాగు చేసేలా రైతులను సన్నద్ధం చేయాలని వ్యవసాయ శాఖ నిర్ణయించింది. ఈ మేరకు 2022 వానాకాలం సీజన్‌ వ్యవసాయ ప్రణాళికను ప్రకటించింది. గతేడాది వానాకాలం సీజన్‌లో 1.29 కోట్ల ఎకరాల్లో పంటలు వేయగా, ఈసారి ఏకంగా 1.42 కోట్ల ఎకరాల్లో సాగు లక్ష్యంగా పేర్కొంది.

అంటే సాగు విస్తీర్ణం 13 లక్షల ఎకరాలు పెరగనుందన్నమాట. మొత్తం 1.42 కోట్ల ఎకరాల్లో ఏ పంట ఎన్ని ఎకరాల్లో సాగు చేయాలో వ్యవసాయ శాఖ ప్రణాళికలో స్పష్టత ఇచ్చింది. ఆ మేరకు అవసరమైన విత్తనాలను అందుబాటులో ఉంచినట్లు తెలిపింది. ఈ వానాకాలం సీజన్‌లో 70 లక్షల ఎకరాల్లో పత్తి సాగు చేస్తారు. గతేడాది వానాకాలం సీజన్‌లో 46.42 లక్షల ఎకరాల్లో ఈ పంట సాగవగా, ఈసారి మరో 23.58 లక్షల ఎకరాలు పెంచేలా ప్రణాళిక రూపొందించింది. 

మరిన్ని వార్తలు