నేటి తరానికి ఇంగ్లిష్‌ అవసరం 

8 Dec, 2021 03:50 IST|Sakshi

ఉపాధ్యాయులకు దశలవారీగా శిక్షణ 

శిక్షణ కార్యక్రమం ప్రారంభించిన మంత్రి సబిత 

సాక్షి, హైదరాబాద్‌: మారుతున్న పరిస్థితులు, అవసరాలకు తగ్గట్టు విద్యా రంగంలో మార్పులకు ప్రభుత్వం శ్రీకారం చుడుతోందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఇందులో భాగంగా ఆంగ్ల మాధ్యమంలో విద్యార్థులను తీర్చిదిద్దేందుకు, మౌలిక సామర్థ్యాలు పెంచేందుకు కృషి చేస్తున్నామన్నారు. ఉపాధ్యాయులు ఆంగ్ల మాధ్యమంపై పట్టు సాధించేందుకు ఏర్పాటు చేసిన ఆన్‌లైన్‌ శిక్షణ కార్యక్రమాన్ని మంగళవారం తన కార్యాలయం నుంచి మంత్రి ప్రారంభించారు.

పిల్లల భవిష్యత్‌ దృష్ట్యా తల్లిదండ్రులు ఆంగ్ల మాధ్యమాన్ని కోరుకుంటున్నారని, దీన్ని సమర్థంగా ముందుకు తీసుకెళ్లాలని సీఎం కేసీఆర్‌ సంకల్పించారని చెప్పారు. ఇందులో భాగంగానే ఉపాధ్యాయులకు దశలవారీగా శిక్షణ కార్యక్రమం చేపడుతున్నామన్నారు. టీచర్లు వృత్తిపరమైన సామర్థ్యం పెంచుకునేందుకు శిక్షణ తీసుకోవాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. కరోనా సమయంలో ఆన్‌లైన్‌ బోధనతో ఉపాధ్యాయులు చేసిన కృషిని మంత్రి అభినందించారు.   

మరిన్ని వార్తలు