వచ్చే నెల 13లోపు నిర్ణయం చెప్పండి

31 Jan, 2023 01:54 IST|Sakshi

కామారెడ్డి మాస్టర్‌ప్లాన్‌పై సర్కార్‌కు హైకోర్టు ఆదేశం 

సాక్షి, హైదరాబాద్‌: కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ కొనసాగుతుందా? రద్దయిందా? ఫిబ్రవరి 13వ తేదీలోగా నిర్ణయం తెలపాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని హైకోర్టు ఆదేశించింది. రైతులను సంప్రదించకుండానే కామారెడ్డి మాస్టర్‌ ప్లాన్‌ రూపొందించారని, ఇది చట్టవిరుద్ధ మని పేర్కొంటూ ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ హైకోర్టులో ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్‌) దాఖలు చేశారు.

మాస్టర్‌ప్లాన్‌ను రద్దు చేసేలా ఆదేశాలివ్వాలని కోరారు. దీనిపై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ ఉజ్జల్‌ భూయాన్, జస్టిస్‌ తుకారాంజీ ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. కేఏ పాల్‌ పార్టీ ఇన్‌ పర్సన్‌గా హాజరై వాదనలు వినిపించారు. మాస్టర్‌ప్లాన్‌ను రద్దు చేసినట్లు  మున్సిపల్‌ కౌన్సిల్‌ ప్రకటించింద న్నారు. కౌన్సిల్‌కు ఆ అధికారం లేదని తెలిపారు. వాదనలు విన్న ధర్మాసనం.. ప్రభుత్వ నిర్ణయం చెప్పాలంటూ విచారణను వాయిదా వేసింది.  

మరిన్ని వార్తలు