హైదరాబాద్‌ సీపీకి నివేదిక ఇచ్చే తీరిక లేదా?.. హైకోర్టు ఆగ్రహం

7 Sep, 2021 13:00 IST|Sakshi

వినాయక నిమజ్జనం ఆంక్షల ఉత్తర్వులను రిజర్వ్‌ చేసిన హైకోర్టు

సాక్షి, హైదరాబాద్‌: వినాయక నిమజ్జనం ఆంక్షలపై ఉత్తర్వులను తెలంగాణ హైకోర్టు రిజర్వ్‌ చేసింది. వినాయక నిమజ్జనంపై మంగళవారం విచారణ చేపట్టిన హైకోర్టు.. నిమజ్జనం సమస్యలపై తెలంగాణ ప్రభుత్వానికి శ్రద్ధ లేనట్లుంది అంటూ వ్యాఖ్యానించింది. విచారణకు 10 నిమిషాల ముందు నివేదిక ఇస్తే ఎలా అని జీహెచ్‌ఎంసీపై ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. హైదరాబాద్‌ సీపీకి నివేదిక ఇచ్చే తీరిక లేదా అని  హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది.

పీసీబీ మార్గదర్శకాలను ఎందుకు పట్టించుకోవడంలేదని హైకోర్టు ప్రశ్నించింది. జనం గుమిగూడకుండా ఏం చర్యలు తీసుకున్నారో చెప్పడం లేదని కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీహెచ్‌ఎంసీలో 48 చెరువులు, కొలనుల్లో నిమజ్జనం ఏర్పాట్లు చేశామని హైకోర్టుకు ప్రభుత్వం తెలిపింది. మట్టి గణపతులను ప్రోత్సహిస్తున్నామని, లక్ష విగ్రహాలు ఉచితంగా ఇస్తున్నామని ప్రభుత్వం పేర్కొంది. సలహాలు కాదు.. చర్యలు, స్పష్టమైన మార్గదర్శకాలు ఉండాలని హైకోర్టు సూచించింది. నిమజ్జనం ఆంక్షలు, నియంత్రణపై తగిన ఆదేశాలు జారీ చేస్తామని హైకోర్టు పేర్కొంది.

ఇవీ చదవండి:
వీడని మిస్టరీ: జయశీల్‌రెడ్డి ఏమయ్యారు? 
తెలంగాణలో 65 వేల ఖాళీలు భర్తీ చేసేలా..

మరిన్ని వార్తలు