17 గంటల్లోనే దుబాయ్‌ నుంచి హైదరాబాద్‌కు.. ఈడీ, ఐటీ దాడులపై స్పందించిన మంత్రి గంగుల

9 Nov, 2022 21:29 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ మంత్రి గంగుల కమలాకర్‌ ఇంట్లో ఈడీ, ఐటీ సోదాలు ముగిశాయి. బుధవారం పలు ప్రాంతాల్లో జరిపిన సోదాల్లో ఈడీ, ఐటీ అధికారులు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం.

ఇదిలా ఉంటే, దుబాయ్‌ పర్యటనకు వెళ్లిన మంత్రి గంగుల ఈడీ దాడులపై సమాచారం అందుకుని వెళ్లిన 17 గంటల్లోనే తిరిగి హైదరాబాద్‌ చేరుకున్నారు. దుబాయ్‌ నుంచి శంషాబాద్‌ చేరుకున్న మంత్రి గంగుల కమలాకర్‌ ఈడీ, ఐటీ దాడులపై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు. ఈడీ విచారణకు పూర్తిగా సహకరిస్తానని తెలిపారు. ఇంట్లోని లాకర్లను తానే వీడియో కాల్‌లో ఉండి ఓపెన్‌ చేయించినట్లు చెప్పారు. 

'ప్రజల దృష్టిని మళ్లించేందుకే ఈ సోదాలు నిర్వహించారు. 31 సంవత్సరాల నుంచి గ్రానైట్‌ వ్యాపారం చేస్తున్నాం. మాపై చాలామంది చాలా సార్లు ఫిర్యాదు చేశారు. ఇప్పటి వరకు మేము ఎక్కడా ఫెమా నిబంధనలు ఉల్లంఘించలేదు. ప్రభుత్వానికి, దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తాం' అని మంత్రి పేర్కొన్నారు. 

చదవండి: (మంత్రి గంగులపై ఫిర్యాదు చేసింది నేనే)

మరిన్ని వార్తలు