ధాన్యం కొనుగోళ్లపై తప్పించుకునేందుకే.. ఎంపీ కోమటిరెడ్డి ఫైర్‌

24 Nov, 2021 08:36 IST|Sakshi
మునుగోడులో మొలకెత్తిన ధాన్యాన్ని ఎంపీ వెంకట్‌రెడ్డికి చూపిస్తున్న రైతులు  

సీఎం ఢిల్లీ పర్యటనపై ఎంపీ కోమటిరెడ్డి విమర్శ

మునుగోడు: వానాకాలం ధాన్యం కొనుగోళ్లు చేయకుండా తప్పించుకునేందుకే సీఎం కేసీఆర్‌ ఢిల్లీ వెళ్లారని భువనగిరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు. మంగళవారం ఆయన నల్లగొండ జిల్లా మునుగోడులో ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి రైతులతో మాట్లాడారు. తాము నెల రోజుల క్రితం ధాన్యం తీసుకొస్తే నేటికీ కొనుగోలు చేయలేదని, వర్షానికి తడిసి ధాన్యం మొలకెత్తిందని రైతులు కన్నీరు పెట్టారు.

వానాకాలం ధాన్యం కొనుగోలు చేయాల్సిన సీఎం, యాసంగిలో వరిసాగు చేయాలా వద్దా అని అడిగేందుకు ఢిల్లీకి వెళ్లడం సిగ్గుచేటన్నారు. ఢిల్లీలో ఆయనకు ఎవరూ అపాయింట్‌మెంట్‌ ఇవ్వ రని తెలిసి కూడా ప్రజలని మభ్యపెట్టేందుకు డ్రామాలు ఆడుతున్నారని పేర్కొన్నారు.   

మరిన్ని వార్తలు