ఉద్యోగుల కేటాయింపులో ఆప్షన్లు

8 Dec, 2021 02:54 IST|Sakshi
సీఎస్‌కు వినతిపత్రం ఇస్తున్న ట్రెసా ప్రతినిధులు 

సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌కు ట్రెసా విజ్ఞప్తి 

సాక్షి, హైదరాబాద్‌: కొత్త జిల్లా, జోనల్, మల్టీ జోనల్‌ కేడర్లకు ఉద్యోగుల కేటాయింపులపై వారి నుంచి ఆప్షన్లు స్వీకరించాలని తెలంగాణ రెవెన్యూ ఎంప్లాయిస్‌ సర్వీసెస్‌ అసోసియేషన్‌ (ట్రెసా) విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వ ఆహ్వానం మేరకు ట్రెసా రాష్ట్ర అధ్యక్షుడు వంగ రవీందర్‌రెడ్డి, ప్రధాన కార్యదర్శి కె.గౌతమ్‌కుమార్‌తో కూడిన ప్రతినిధి బృందం మంగళవారం బీఆర్‌కేఆర్‌ భవన్‌లో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌తో సమావేశమైంది. కొత్త లోకల్‌ కేడర్లకు ఉద్యోగుల కేటాయింపులపై చర్చించింది. మార్గదర్శకాలు విడుదల చేస్తూ ప్రభుత్వం జారీ చేసిన జీవో నం.317లో ఈ కింది అంశాలను చేర్చాలని బృందం సూచించింది.  

ఉద్యోగులు/కుటుంబ సభ్యులు బైపాస్‌ సర్జరీ చేయించుకోవడం, ఇతర తీవ్ర అనారోగ్య సమస్యలు కలిగి ఉంటే ప్రత్యేక కేటగిరీ కింద ప్రాధాన్యత ఇవ్వాలి.  
45 శాతం వరకు అంగవైకల్యం కలిగిన వారికి ప్రాధాన్యత ఇవ్వాలి.  
కొత్త జిల్లాల ఏర్పాటు సమయంలో ఆర్డర్‌ టు సర్వ్‌ కింద బదిలీకి గురైన ఉద్యోగులకు కూడా ప్రాధాన్యత కల్పించాలి.  n సొంత జిల్లా, ప్రస్తుతం పని చేస్తున్న జిల్లాతో పాటు మొదటి నియామక జిల్లాను దరఖాస్తు నమూనాలో చేర్చాలి.  
రెవెన్యూ శాఖను బలోపేతం చేసేందుకు గరిష్ట కేడర్‌ స్ట్రెంగ్త్‌ నిర్ధారించాలి. 

ట్రెసా చేసిన ఇతర విజ్ఞప్తులు.. 
పెండింగ్‌లో ఉన్న డిప్యూటీ కలెక్టర్, స్పెషల్‌ గ్రేడ్‌ డిప్యూటీ కలెక్టర్లకు పదోన్నతులు కల్పించాలి. 
డీపీసీ ఆమోదం పొంది తహశీల్దార్లుగా పోస్టింగ్‌ కోసం నిరీక్షణలో ఉన్న డిప్యూటీ తహశీల్దార్లకు పోస్టింగులు ఇవ్వాలి. 2017–18 నుండి డిప్యూటీ తహసీల్దార్ల కొత్త ప్యానెల్స్‌ తయారు చేయాలి. 
సుదూర ప్రాంతాలోని ప్రొబేషనరీ నాయబ్‌ తహసీల్దార్లకు జిల్లా బదిలీల్లో అవకాశం కల్పించాలి. ∙వీఆర్వోలకు కూడా బదిలీ ఆప్షన్లు ఇవ్వాలి. ∙వీఆర్‌ఏలకు స్కేల్‌ వర్తింప చేయాలి.  

మరిన్ని వార్తలు