శ్రీశైలంలో పది, సాగర్‌లో 22 గేట్లు ఎత్తివేత 

15 Oct, 2022 01:30 IST|Sakshi
నాగార్జునసాగర్‌

జూరాలకు 2.67లక్షల ఇన్‌ఫ్లో, 43 గేట్ల ఎత్తివేత 

దోమలపెంట(అచ్చంపేట)/గద్వాల రూరల్‌/నాగార్జునసాగర్‌: జోగుళాంబ గద్వాల జిల్లాలో జూరాల ప్రాజెక్టుకు 2,67, 000 క్యూసెక్కుల ఇన్‌ఫ్లో ఉండగా.. 43 గేట్లు ఎత్తి నీటిని కిందికి విడుదల చేస్తున్నారు. జూరాల, సుంకేసుల నుంచి శ్రీశైలం ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం పోటెత్తుతోంది. మొత్తం 3,76, 825 క్యూసెక్కుల నీరు శ్రీశైలం ప్రాజెక్టుకు వస్తోంది. జలాశయం నీటిమట్టం 884.5 అడుగులు కాగా, 212.9198 టీఎంసీల నీరు నిల్వ ఉంది.

శుక్రవారం ఆనకట్ట వద్ద పదిగేట్లను 15 మీటర్ల మేర ఎత్తి 3,77,160 క్యూసెక్కుల నీటిని కిందికి వదులుతున్నారు. ఎగువ నుంచి మొత్తం 4,42,694 క్యూసెక్కుల నీరు నాగార్జునసాగర్‌ ప్రాజెక్టులోకి వచ్చి చేరుతోంది. దీంతో సాగర్‌ ప్రాజెక్టు వద్ద 22 రేడియల్‌ క్రస్ట్‌గేట్ల ద్వారా 3,55,228 క్యూసెక్కుల నీటిని వదులుతున్నారు. విద్యుదుత్పాదనకు, కుడి, ఎడమ కాల్వలు, వరదకాల్వలు, ఎస్‌ఎల్‌బీసీకి నీటిని విడుదల చేస్తున్నారు. సాగర్‌ జలాశయం నీటిమట్టం ప్రస్తుతం 589.50 అడుగులు ఉంది. 

మరిన్ని వార్తలు