Electricity Tariffs: విద్యుత్‌ ఛార్జీల పెంపునకు ఏపీఈఆర్సీ ప్రతిపాదనలు

30 Mar, 2022 12:59 IST|Sakshi

సాక్షి, తిరుపతి: విద్యుత్‌ ఛార్జీల పెంపునకు రాష్ట్ర విద్యుత్‌ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రతిపాదనలు తెలిపింది. ఈ సందర్భంగా తిరుపతిలో విద్యుత్ చార్జీల టారిఫ్‌ను  పీఈఆర్సీ చైర్మన్ జస్టిస్ సీవీ నాగార్జున రెడ్డి విడుదల చేశారు. 2022-23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి విద్యుత్ చార్జీల ఉత్తర్వులను విడుదల చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. కేటగిరీలను రద్దు చేసి 6 స్లాబ్‌లను తీసుకొచ్చినట్లు తెలిపారు

ధరలు పెంచడం బాధాకరంగా ఉన్నా తప్పడం లేదని పేర్కొన్నారు.  విద్యుత్ సంస్థల మనుగడ ప్రశ్నార్థకం అవుతుంది కాబట్టే తప్పని పరిస్థితుల్లో గృహ వినియోగదారులకు విద్యుత్ చార్జీలు పెంచాల్సి వచ్చిందన్నారు.  20 ఏళ్ల తరువాత విద్యుత్‌ ఉత్పత్తి ఖర్చు పెరిగి పోవడంతోనే చార్జీలు పెంచి వినియోగదారులపై భారం మోపాల్సి వచ్చిందని ఏపీ ఈఆర్సీ చైర్మన్ జస్టిస్ నాగార్జున రెడ్డి తెలిపారు.

కాగా ఏపీఈఆర్సీ ప్రతిపాదనల ప్రకారం.. 30 యూనిట్ల వరకు 45 పైసలు పెంపు,  31- 75 యూనిట్ల వరకు 91 పైసలు పెంపు, 76 నుంచి 125 యూనిట్ల వరకు రూ.1.40 పెంపు, 126 నుంచి 225 యూనిట్ల వరకు రూ.1.57 పెంపు, 226 నుంచి 400 యూనిట్ల వరకు రూ.1.16 పెంపు, 400 యూనిట్‌కు 55పైసల పెంపుకు ప్రతిపాదించాయి.

మరిన్ని వార్తలు