Hyderabad: ఐదు రోజులపాటు ట్రాఫిక్‌ ఆంక్షలు.. ఈ మార్గాల్లోనే.. 

26 Dec, 2022 07:27 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రపతి ద్రౌపది ముర్ము శీతాకాల విడిదికి నగరానికి రానున్న నేపథ్యంలో సోమవారం నుంచి నగరంలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలు చేయనున్నారు. ఈ మేరకు నగర పోలీసు కమిషనర్‌ సీవీ ఆనంద్‌ ప్రకటనలో వివరాలు వెల్లడించారు.  

రోజువారీగా ట్రాఫిక్‌ ఆంక్షలిలా..  
సోమవారం మధ్యాహ్నం 3 నుంచి రాత్రి 10 గంటల వరకు హకీంపేట నుంచి సోమాజిగూడ మార్గంలోని తిరుమలగిరి, కార్ఖానా, సికింద్రాబాద్‌ క్లబ్, టివోలీ, ప్లాజా, బేగంపేట, రాజ్‌భవన్‌ రోడ్డులో ట్రాఫిక్‌ ఆంక్షలు అమలులో  ఉంటాయి. మంగళవారం ఉదంయం 9 నుంచి 12 గంటల వరకు హకీంపేట, తిరుమలగిరి, కార్ఖానా, సికింద్రాబాద్‌  క్లబ్, టివోలీ ప్లాజా, సీఈఓ, ప్యారడైజ్, రాణీగంజ్, కర్బలా, ట్యాంక్‌బండ్, లిబర్టీ, హిమాయత్‌నగర్‌ వై జంక్షన్, నారాయణగూడ ఎక్స్‌ రోడ్డు, వైఎంసీఏ మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయి. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు  హకీంపేట– తిరుమలగిరి– కార్ఖానా– సికింద్రాబాద్‌ క్లబ్‌– టివోలీ ప్లాజా, సీటీఓ– బేగంపేట–ఎన్‌ఎఫ్‌సీఎల్‌– బంజారాహిల్స్‌ రోడ్‌నంబర్‌ 1/10 జంక్షన్, మాసాబ్‌ట్యాంక్, సరోజినీదేవి ఐ హాస్పిటల్, పీవీ ఎక్స్‌ప్రెస్‌ హైవే ఆరాంఘర్, కాటేదాన్, మైలార్‌దేవ్‌పల్లి – బండ్లగూడ, చాంద్రాయణ గుట్ట, పిసల్‌బండ/చారి్మనార్‌ మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయి. ఈ మార్గంలో ఎయిర్‌పోర్టుకు వెళ్లే వారు బాలాపూర్‌ లేదా ఐఎస్‌ సదన్, నల్గొండ ఎక్స్‌ రోడ్డు మార్గాల్లో వెళ్లాలి.  

బుధవారం ఉదయం 7 నుంచి 9 గంటల వరకు హకీంపేట– అల్వాల్, లోతుకుంట మార్గంలో మాత్రమే ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయి. తిరుమలగిరి నుంచి శామీర్‌పేట వెళ్లే ట్రాఫిక్‌ను బోయిన్‌పల్లి సుచిత్ర మీదుగా బాలాజీనగర్‌– అమ్ముగూడ నుంచి వచ్చే ట్రాఫిక్‌ను లాల్‌బజార్, కేవీ జంక్షన్‌ వైపునకు మళ్లిస్తారు. 
గురువారం ఉదయం 9.00 గంటల నుంచి మధ్యాహ్నం 1.00 గంటల వరకు బొల్లారం – షేక్‌పేట మార్గంలోని లోతుకుంట వై జంక్షన్, లాల్‌బజార్, తిరుమలగిరి, కార్ఖానా, సికింద్రాబాద్‌ క్లబ్, టివోలీ, ప్లాజా, బగేంపేట, పంజగుట్ట, ఎస్‌ఎన్‌టీ జంక్షన్, ఫిల్మ్‌నగర్‌ (బీవీబీ), షేక్‌పేట, ఓయాసిస్‌ స్కూల్‌ టోలీ చౌకీ మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయి.  
తిరిగి సాయంత్రం 5 నుంచి రాత్రి 8 గంటల వరకు శంషాబాద్‌– బొల్లారం మార్గంలోని పీవీ ఎక్స్‌ప్రెస్‌వే– ఎన్‌ఎండీసీ– మాసాబ్‌ట్యాంక్‌– బంజారాహిల్స్‌ 1/12 జంక్షన్‌ – రోడ్‌ నెంబర్‌ 1/10, తాజ్‌కృష్ణ– జీవీకే– ఎన్‌ఎఫ్‌సీఎల్, పంజాగుట్ట ఫ్లైఓవర్, గ్రీన్‌ల్యాండ్స్, బేగంపేట ఫ్లైఓవర్, రసూల్‌పురా, సీటీఓ ఫ్లైఓవర్, ప్లాజా, టివోలీ, సికింద్రాబాద్‌ క్లబ్, కార్ఖానా– తిరుమలగిరి– లోతుకుంట మార్గాల్లో ట్రాఫిక్‌ ఆంక్షలు అమల్లో ఉంటాయి.  
శుక్రవారం ఉదయం 11 నుంచి రాత్రి 7 గంటల వరకు సోమాజిగూడ– బొల్లారం మార్గంలోని సోమాజిగూడ, రాజ్‌భవన్‌ రోడ్డు, బేగంపేట– ప్లాజా– టివోలీ– సికింద్రాబాద్‌ క్లబ్‌– కార్ఖానా– తిరుమలగిరి– లోతుకుంట మార్గంలో ట్రాఫిక్‌ ఆంక్షలు ఉంటాయి.  

భద్రత కట్టుదిట్టం 
హిమాయత్‌నగర్‌: నారాయణగూడలోని కేశవ మెమోరియల్‌ విద్యాసంస్థల (కేఎంఐ)కు మంగళవారం రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రానున్న నేపథ్యంలో పోలీసులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేస్తున్నారు. కాలేజీ యాజమాన్యం ఆమెకు ఘనంగా స్వాగతం పలకనుంది. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము మంగళవారం ఉదయం 10.20 గంటలకు కాలేజీకి వచ్చి ఇక్కడ జరిగే సదస్సులో గంటకు పైగా ఉండనున్నారు.

ఆజాదీ కా అమృత్‌ మహోత్సవాల్లో భాగంగా ‘నైజాం నుంచి హైదరాబాద్‌ విముక్తి’ అనే అంశంపై జరిగే సదస్సులో రాష్ట్రపతి పాల్గొననున్నారు. బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌ నుంచి నారాయణగూడలోని విద్యాసంస్థలకు సరిగ్గా మంగళవారం ఉదయం 10.20 గంటలకు ఆమె ఇక్కడికి వస్తారు. తిరిగి ఉదయం 11.30 గంటలకు బొల్లారంలోని రాష్ట్రపతి భవన్‌కు వెళతారు. సదస్సులో ఇక్కడి విద్యాసంస్థల విద్యార్థులతో పాటు నగరంలోని మరో పది కాలేజీల నుంచి విద్యార్థులు హాజరు కానున్నారు.

ప్రతి కాలేజీ నుంచి 10 మంది విద్యార్థులు, ఒక ఇన్‌చార్జి  లేదా ప్రిన్సిపాల్‌ ఉంటారు. ఇలా 700 మంది విద్యార్థులు 200 మంది ఇన్‌చార్జిలు వస్తున్నారు. తొలుత ఆజాదీ కా అమృత్‌ మహోత్సవ ప్రసంగం ముగిసిన తర్వాత 700 మంది విద్యార్థులతో రాష్ట్రపతి ముఖాముఖి కానున్నారు. తెలంగాణకు చెందిన మహనీయుల ఫొటో ఎగ్జిబిషన్‌ను ఆమె తిలకించనున్నారు. కాగా.. కేశవ్‌ మెమోరియల్‌ విద్యాసంస్థలకు 2014లో దేశ ప్రధాని అభ్యరి్థగా.. గుజరాత్‌ ముఖ్యమంత్రిగా నరేంద్ర మోదీ వచ్చారు. విద్యార్థులతో మమేకమై.. వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.      

మరిన్ని వార్తలు