కుమ్మరి కులవృత్తిదారులకు సర్కారు చేయూత

13 Sep, 2021 05:07 IST|Sakshi

త్వరలో రూ.లక్ష విలువ చేసే పాటరీ యూనిట్లు అందజేత  

ఉత్తర్వులు జారీ చేసిన బీసీ కార్పొరేషన్‌ ఎండీ అలోక్‌కుమార్‌ 

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో కుమ్మరి కులవృత్తిదారులకు చేయూతనందించాలని రాష్ట్ర ప్రభు త్వం నిర్ణయించింది. ఇందులో భాగంగా బీసీ కార్పొరేషన్‌ ద్వారా శిక్షణ పొందిన 320 మందికి త్వరలో పాటరీ యూనిట్లు అందించనుంది. ఈ మేరకు బీసీ కార్పొరేషన్‌ వీసీఎండీ అలోక్‌కుమార్‌ ఆదివారం ఉత్తర్వులు జారీ చేశారు. పాటరీ యూనిట్‌లోని యంత్రాల విలువ లక్ష రూపాయల వరకు ఉంటుందని పేర్కొన్నారు.

ఈ యంత్రాలతో మట్టిపాత్రలు, కూజాలు, మట్టి వాటర్‌ బాటిళ్లు, టీ కప్పులు, మట్టి విగ్రహాలు, దీపాలు, ఇతరత్రా అలంకరణ సామాగ్రిని వేగంగా, వివిధ డిజైన్లతో రూపొందించడానికి వీలుంటుందని అలోక్‌కుమార్‌ వివరించారు. పాటరీ యంత్రాలను రూ.80 వేల రాయితీతో అందిస్తామని పేర్కొన్నారు. అలాగే హుజూరాబాద్‌ నియోజకవర్గంలోని కుమ్మరి వృత్తిదారుల ఆర్థిక స్వావలంబనకు ఆధునిక యంత్రాలను అందించనున్నట్లు వెల్లడించారు. 

మరిన్ని వార్తలు