Inter Results: జవాబు పత్రాలు దిద్దిన అధ్యాపకుడి నిర్లక్ష్యం.. అప్పుడు 0.. ఇప్పుడు 44

7 Jul, 2022 10:09 IST|Sakshi

ముదిగొండ: ఇంటర్మీడియట్‌ జవాబు పత్రాలు దిద్దిన అధ్యాపకుడి నిర్లక్ష్యంతో పరీక్షల్లో ఫెయిల్‌ అయినట్లు మెమో వచ్చిన విద్యార్థికి ఇప్పుడు ఊరట లభించింది. ఖమ్మం జిల్లా ముదిగొండ ప్రభుత్వ జూనియర్‌ కళాశాలలో హెచ్‌ఈసీ గ్రూప్‌తో చదివిన భద్రి గోపి ఇంటర్‌ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాశాడు. ఇటీవల ప్రకటించిన ఫలితాల్లో అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణుడైన అతడికి ఎకనామిక్స్‌లో మాత్రం సు న్నా మార్కులు వచ్చాయి.

దీంతో ఎకనామిక్స్‌ జవాబు పత్రం రీ వాల్యుయేషన్‌ కోసం దరఖాస్తు చేసుకున్నాడు. ఈ సందర్భంగా ఎకనామిక్స్‌లో 44 మార్కులు వచ్చినట్లు కొత్త మెమోను బుధవారం వెబ్‌సైట్‌లో పొందు పరచడంతో గోపి ఊపిరి పీల్చుకున్నాడు.
చదవండి👇
తస్మాత్ జాగ్రత్త.. కాల్‌ చేసి ]401]తో కలిపి డయల్‌ చేయాలని చెబుతున్నారా..
తెలంగాణలో జికా వైరస్‌ కలకలం.. హెచ్చరించిన వైద్యులు

మరిన్ని వార్తలు