తెలంగాణలో కొత్తగా 33 గురుకులాలు.. 15 డిగ్రీ కాలేజీలు | Sakshi
Sakshi News home page

తెలంగాణలో కొత్తగా 33 గురుకులాలు.. 15 డిగ్రీ కాలేజీలు

Published Thu, Jul 7 2022 10:16 AM

Telangana Govt Decides To Establish 33 New Gurukul Schools In 33 Districts - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: వెనుకబడిన వర్గాల విద్యాభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కృషి చేస్తోందని బీసీ సంక్షేమం, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్‌ అన్నారు. ఇందులో భాగంగా ప్రతి సంవత్సరం బీసీ విద్యార్థుల కోసం కొత్తగా గురుకుల విద్యాసంస్థల సంఖ్యను పెంచుతున్నట్లు తెలిపారు. కొత్త గురుకులాల ఏర్పాటు, అప్‌గ్రేడేషన్‌ తదితర అంశాలపై బుధవారం మంత్రి తన చాంబర్లో బీసీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రతి జిల్లాలో ఒక గురుకుల పాఠశాలను ప్రారంభించాలని ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకోసం 33 జిల్లాల్లో 33 కొత్త స్కూళ్ల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఈ ఏడాది కొత్తగా 4 గురుకుల పాఠశాలలను జూనియర్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేస్తున్నామని, ఇందుకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశామని వెల్లడించారు. వచ్చే ఏడాది మరో 115 స్కూళ్లను జూనియర్‌ కాలేజీలుగా అప్‌గ్రేడ్‌ చేయనున్నట్లు స్పష్టం చేశారు.

ప్రస్తుతం బీసీ సంక్షేమ శాఖ పరిధిలో ఒక డిగ్రీ కాలేజీ మాత్రమే ఉందని, మరో 15 డిగ్రీ కాలేజీలనుఈ విద్యా సంవత్సరం నుంచే ఏర్పాటు చేయనున్నామని వివరించారు. ఇందుకు సంబంధించి ప్రతి­పాదనలు సిద్ధం చేయాలని బీసీ గురుకుల సొసైటీ కార్యదర్శిని మంత్రి గంగుల ఆదేశించారు. ఈ డిగ్రీ కళాశాలల్లో కోర్సులను వైవిధ్యంగా తీర్చిదిద్దాలని, ఇందుకోసం తెలంగాణ ఉన్నత విద్యామండలి సహకారం తీసుకోవాలని సూచించారు.

డిగ్రీ కాలేజీల్లో అందించే ఆరు కోర్సుల్లో మూడు కొత్త వాటిని ప్రవేశ­పె ట్టాల­­­ని, పారిశ్రామిక రంగం అవసరాల మేరకు వాటితో అనుసంధానం చేయా లని చెప్పా­రు. మెషిన్‌ లెర్నింగ్, ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, డాటాసైన్స్, క్లౌడ్‌ టెక్నాలజీ, సాప్, న్యూట్రిషన్‌ ఫుడ్‌ టెక్నాలజీ, ఫ్యాషన్‌ టెక్నాలజీ, టెక్స్‌ టైల్‌ టెక్నా­ల­జీ, బీబీఏ, బీకాం కంప్యూటర్స్, ఎంపీసీఎస్, ఎంఎస్సీఎస్‌ వంటి కోర్సు­లను కాలేజీల వారీగా ప్రవేశపెట్టాలని సూచించారు. వీటి ద్వారా విద్య పూర్తి చేసుకొనే తరుణంలో గురుకుల సొసైటీ ద్వారానే క్యాంపస్‌ ప్లేస్‌మెంట్లు నిర్వహించాలని, ఈ మేరకు కాలేజీల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఆదేశించారు. 

మరో 21 బీసీ స్టడీ సర్కిళ్లు:రాష్ట్రంలో మరో 21 బీసీ స్టడీ సర్కిళ్ల ఏర్పాటుకు కార్యాచరణ రూపొందించాలని మంత్రి గంగుల కమలాకర్‌ అధికారులను ఆదేశించారు. ఆత్మగౌరవ భవనాల నిర్మాణం కోసం ఏకసంఘంగా ఏర్పడిన కులాలకు నిర్మాణ బాధ్యతలు అప్పగిస్తున్నామన్నారు. కొత్తగా మరో ఆరు కులా లు ఏక సంఘంగా ఏర్పడ్డాయని వీటికి ఈ నెల 8న నిర్మాణ అనుమతి పత్రాలు అందజేస్తామని వెల్లడించారు. ఏకసంఘంగా ఏర్పడని వాటిని సైతం త్వరలోనే ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మాణం ప్రారంభిస్తామని తెలిపారు. సమావేశంలో బీసీ సంక్షేమ శాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం పాల్గొన్నారు.   

Advertisement
Advertisement