Gandhi Hospital: ప్రతిరోజు 25 డెలివరీలు.. ఒకే బెడ్‌పై ఇద్దరు బాలింతలు.. 

2 Nov, 2021 08:24 IST|Sakshi
గాంధీ గైనకాలజీ విభాగంలో ఒకే బెడ్‌పై ఇరువురు బాలింతలు, శిశువులు

 సామాజిక మాధ్యమాల్లో దృశ్యాలు వైరల్‌

 దుస్థితిపై వెల్లువెత్తుతున్న ఆగ్రహావేశాలు

సాక్షి, గాంధీ ఆస్పత్రి: సికింద్రాబాద్‌ గాంధీఆస్పత్రి గైనకాలజీ విభాగంలో ఇరువురు బాలింతలకు ఒకే బెడ్‌ కేటాయించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ అయ్యాయి. ప్రధాన భవనంలోని మొదటి, రెండు అంతస్తుల్లో గైనకాలజీ విభాగం కొనసాగుతోంది. గైనిక్‌ సాధారణ, లేబర్‌ వార్డుల్లో కలిపి సుమారు 200 మందికి వైద్య సేవలు అందించే అవకాశం ఉంది. ప్రతిరోజు 25 నుంచి 30 డెలివరీలు జరుగుతాయి.

ఇరువురు బాలింతలకు ఒకే బెడ్‌ కేటాయించడంతో బాధిత కుటుంబ సభ్యులు ఆస్పత్రి సిబ్బందితో వాగ్వాదానికి దిగుతున్నారు. కరోనా సమయంలో బాలింతలు, శిశువుల కలిసి మొత్తం నలుగురు ఒకే పడకపై ఎలా పడుకుంటారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లేబర్‌వార్డులో ఒకే మంచంపై ఇరువురు బాలింతలు తమ శిశువులతో ఉన్న దృశ్యాలు సోమవారం సామాజిక మాధ్యమాల్లో వైరల్‌ కావడంతో ఆస్పత్రి పాలన యంత్రాంగం స్పందించి విచారణ చేపట్టింది. 
చదవండి: హుజురాబాద్‌ ఫలితాలు: ఈవీఎం మొరాయిస్తే వీవీప్యాటే కీలకం

కోవిడ్‌ పడకలతో సమస్య ఉత్పన్నం.. 
కరోనా మొదటి, సెకండ్‌వేవ్‌ల సమయంలో గాంధీ గైనకాలజీ విభాగం అత్యుత్తమ సేవలు అందించింది. కరోనా సోకిన వందలాది మంది గర్భిణులకు పురుడు పోసి తల్లీబిడ్డలకు పునర్జన్మ ప్రసాదించారు. ప్రస్తుతం ఉన్న కోవిడ్‌ పాజిటివ్‌ గర్భిణులు, థర్డ్‌వేవ్‌ వస్తే మరింత మెరుగైన వైద్యం అందించేందుకు కొన్ని వార్డులను కరోనా కోసం కేటాయించడం, డెలివరీ కేసుల సంఖ్య అమాంతం పెరగడంతో పడకల సమస్య ఉత్పన్నమయినట్లు తెలుస్తోంది. 
చదవండి: నాగశౌర్య ఫామ్‌హౌజ్‌ కేసు: బర్త్‌డే పార్టీ ముసుగులో పేకాట
గైనకాలజీ పడకల సంఖ్య పెంపు..  
గైనకాలజీ విభాగంలో పడకల సంఖ్యను పెంచేందుకు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నాం. ఇరువురు బాలింతలకు ఒకే బెడ్‌ కేటాయించినట్లు మా దృష్టికి రావడంతో విచారణ చేపట్టాం. కొన్ని బెడ్లపై బాలింతలతో పాటు వారి కుటుంబ సభ్యులు, సహాయకులు ఉన్నట్లు గుర్తించాం. గైనకాలజీ విభాగంలో కొన్ని వార్డులను కోవిడ్‌కు కేటాయించడంతో అందుబాటులో ఉన్న పడకల సంఖ్య కొంతమేర తగ్గాయి.
– ప్రొఫెసర్‌ రాజారావు,  గాంధీ ఆస్పత్రి సూపరింటెండెంట్‌   

మరిన్ని వార్తలు