పోలీసులు వన్‌సైడ్‌గా పని చేస్తున్నారు: ఉత్తమ్‌

6 Sep, 2020 13:24 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌ : తెలంగాణ రాష్ట్రంలో పోలీసులు వన్‌సైడ్‌‌గా పని చేస్తున్నారని, ప్రతిపక్షాన్ని తొక్కేస్తున్నారని టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి వ్యాఖ్యానించారు. మాట్లాడితే కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్నారన్నారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘ డీసీసీ అధ్యక్షులు అంశాల వారీగా పోరాటాలు చేయాలి. ప్రజల సమస్యలపై క్షేత్ర స్థాయిలో పోరాటానికి సిద్ధం కావాలి. గత ఎన్నికలలో టీఆర్‌ఎస్‌కు అండగా ఉన్న వర్గాలు ఇప్పుడు బలంగా వ్యతిరేకిస్తున్నాయి.  వాళ్లంతా మనవైపు వస్తున్నారు. వచ్చే ఎన్నికలలో కచ్చితంగా కాంగ్రెస్ వైపు వస్తారు. భవిష్యత్ కాంగ్రెస్ పార్టీదే. నేను మీకు నిరంతరం అండగా అందుబాటులో ఉంటాను, కొట్లాడుదాం.. గుర్తింపు తెచుకుందాం. పార్టీని మరింత బలోపేతం చేద్దాం. ( ఉత్తమ్‌ మోకాలికి తీవ్ర గాయం )

మీ కష్టానికి ఫలితం దక్కుతుంది. రాబోయే ఎన్నికలలో మనమే గెలుస్తాం. డీసీసీ అధ్యక్షులు జిల్లాల్లో చాలా కష్టపడి పని చేస్తున్నారు. పార్టీ నేడు పటిష్టంగా ఉందంటే డీసీసీ అధ్యక్షులు చేస్తున్న కృషియే కారణం. నేటికి గ్రామీణ ప్రాంతాల్లో పార్టీ పునాదులు గట్టిగా ఉన్నాయి. 2014, 18 ఎన్నికలలో ఓటమికి అనేక కారణాలు ఉన్నాయి. కేసీఆర్ పాలనపై ఇప్పుడు ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతోంది. రాష్ట్రంలో కేసీఆర్ పాలన విపరీతమైన అవినీతికి ఆస్కారం ఇస్తోంది. ఎన్నికలలో టీఆర్‌ఎస్‌ అవినీతి సొమ్మును విచ్చలవిడిగా ఖర్చు చేస్తోంద’’న్నారు.

మరిన్ని వార్తలు