బ్రేకింగ్‌ : దీపిక కిడ్నాప్‌ కథ సుఖాంతం

29 Sep, 2020 18:11 IST|Sakshi

సాక్షి, వికారాబాద్‌ : వికారాబాద్‌లో మూడు రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన దీపిక కిడ్నాప్‌ కథ సుఖాంతమైంది. మంగళవారం సాయంత్రం దీపిక తన భర్త అఖిల్‌తో కలిసి వికారాబాద్‌ ఎస్పీ కార్యాలయానికి చేరుకుంది. ఈ మేరకు దీపిక ఇష్టంతోనే భర్త అఖిల్‌ ఆమెను తీసుకెళ్లినట్లు పోలీసులు నిర్థారించారు. దీపిక తల్లిదండ్రుల ఫిర్యాదుతో గత మూడు రోజులగా ఆమె కోసం ఆరు బృందాలుగా ఏర్పడి గాలింపు చేపడుతున్న పోలీసులకు మంగళవారం ఉదయమే ట్విస్ట్‌ ఇచ్చింది. పోలీసులకు ఫోన్‌ చేసిన దీపిక.. తనను ఎవరు కిడ్నాప్‌ చేయలేదని.. తాను ఇష్టపూరితంగానే భర్త అఖిల్‌తో కలిసి వెళ్లినట్లు పోలీసులకు తెలిపింది. (చదవండి : మలుపులు తిరుగుతున్న దీపిక కిడ్నాప్‌ కేసు)

అసలు విషయంలోకి వెళితే.. వికారాబాద్‌కు చెందిన దీపిక, అఖిల్‌ 2016లో ఆర్యసమాజ్‌లో ప్రేమ వివాహం చేసుకున్నారు. పెళ్లి అమ్మాయి తల్లిదండ్రులకు ఇష్టం లేకపోవడం రెండు సంవత్సరాల క్రితం అమ్మాయిని తీసుకొచ్చారు. కుటుంబ సభ్యుల బలవంతం మేరకు అఖిల్‌ నుంచి విడాకులు కోరుతూ దీపిక కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఈ క్రమంలోనే గత (శనివారం) ఇరువురు వికారాబాద్ కోర్టుకు హాజరయ్యారు. అనంతరం అదే రోజు సాయంత్రం దీపిక షాపింగ్‌కు వెళ్లి ఇంటికి వెళ్తుండగా.. ఓ కారులో ముగ్గురు వ్యక్తులు వచ్చి ఆ యువతిని బలవంతంగా కారులో ఎక్కించుకుని పోయారు. దీనిపై యువతి కుటుంబ సభ్యులు పోలీసులు ఆశ్రయించారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు గత మూడు రోజులుగా పోలీసులు కేసును దర్యాప్తు చేస్తున్నారు. తాజాగా దీపిక తన భర్త అఖిల్‌తో కలిసి ఎస్పీ కార్యాలయానికి రావడంతో కిడ్నాప్‌ కథ ముగిసినట్లయింది. (చదవండి :వికారాబాద్‌లో కిడ్నాప్‌ కలకలం)

Read latest Telangana News and Telugu News
Follow us on FaceBook, Twitter, Instagram, YouTube
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
మరిన్ని వార్తలు