ఇంటర్‌లో ఫస్టియర్‌ ఫలితాల్లో వరంగల్‌ విద్యార్థి ప్రతిభ

17 Dec, 2021 18:19 IST|Sakshi

వరంగల్‌: ఇంటర్మీడియెట్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో వరంగల్‌ విద్యార్థి గుండ సాయి శ్రావణి అద్భుత ప్రతిభ కనబరిచింది. గురువారం వెల్లడైన ఫలితాల్లో రాష్ట్ర స్థాయిలో ఆమె మెరుగైన మార్కులు సాధించారు. ఎంపీసీ విభాగంలో మొత్తం 470 మార్కులకు గాను 466 మార్కులు తెచ్చుకున్నారు. రాష్ట్ర స్థాయిలో ఇది రెండో అత్యుత్తమ మార్కులుగా పేర్కొంటున్నారు. 

ఇంటర్‌ ఫస్టియర్‌ ఫలితాల్లో లాంగ్వెజెస్‌ను మినహాయిస్తే మ్యాథ్స్‌, కెమిస్ట్రీ, ఫిజిక్స్‌లో ఫుల్‌ మార్కులు సాధించారు. ఇంగ్లీష్‌ వందకి 97, సంస్కృతంలో వందకి 99 మార్కులు తెచ్చుకున్నారు. సాయి శ్రావణి మార్కుల పట్ల ఆమె తల్లిదండ్రులు గుండ అమర్‌నాథ్‌, నిర్మలాదేవిలు హర్షం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు