భర్త తిట్టాడనే మనస్తాపంతో!

10 Mar, 2021 09:58 IST|Sakshi

కొత్తకోట రూరల్‌: పట్టణ కేంద్రంలోని రాఘవేంద్ర కాలనీకి చెందిన ఓ గృహిణి అదృశ్యమైన ఘటన చోటుచేసుకుంది. ఎస్‌ఐ నాగశేఖర్‌రెడ్డి తెలిపిన వివరాలు.. పట్టణానికి చెందిన కొమ్ము నర్సమ్మ(60)  సోమవారం భర్త తిట్టాడని ఇంటి నుంచి వెళ్లిపోయింది. బంధువుల దగ్గర వెతికినా ఆమె ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం, ఆమె భర్త చంద్ర య్య పోలీసులకు ఫిర్యాదు చేశాడు.

ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్‌ఐ తెలిపారు. ఆమె ఆచూకీ తెలిసిన వారు సెల్‌ నంబర్‌ 94407 95727కు సమాచారం ఇవ్వాలని ఎస్‌ఐ పేర్కొన్నారు. 

చదవండి: పక్కింటికే కన్నం వేసిన జల్సారాయుడు!

   

మరిన్ని వార్తలు