రాయిని తొలచి.. రావి ఆకుగా మార్చి.. 

28 May, 2021 16:46 IST|Sakshi

27 గుంటల విస్తీర్ణంలో నాటిన మొక్కలు

మొక్కలతో కనువిందు చేయనున్న యాదాద్రి

యాదగిరిగుట్ట: ఎక్కడ చూసినా ఆహా.. అనిపించే అందాలు. ఆహ్లాదాన్ని కలిగించే ఆకుపచ్చని మొక్కలు.. భక్తులకు ఆధ్యాత్మికతతో పాటు.. రంగురంగుల పూల మొక్కలతో కనువిందు చేసే విధంగా యాదాద్రి శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయం, చుట్టు పక్కల పరిసరాలను వైటీడీఏ అధికారులు తీర్చిదిద్దుతున్నారు. కొండకు వెళ్లే మార్గంలోని రెండో ఘాట్‌ రోడ్డు కింది భాగంలో, గిరిప్రదక్షిణ రోడ్డుకు ఆనుకొని ఉన్న భారీ రాయిని తొలచి దానిని రావి ఆకు మాదిరిగా మార్చారు.

ఎకరం పైగా స్థలంలో ఉన్న ఈ రాయిని 27 గుంటల్లో తొలచి దాని చుట్టూ భారీ రావి ఆకుగా తీర్చిదిద్దారు. ఈ రావి ఆకు ఆకారంలో పూణె నుంచి తీసుకొచ్చిన గులాబీ, తెలుపు రంగులో ఉన్న సుమారు 12వేల పూల మొక్కలు నాటుతున్నారు. చుట్టు ఆకు మాదిరిగా ఉన్న డిజైన్‌లో గ్రీనరీతో కూడిన లాన్‌ ఏర్పాటు చేయనున్నారు.

చదవండి:
కరోనా ‘వల’కు చిక్కొద్దు..!

కుర్రారంలో కాలాముఖ దేవాలయం

మరిన్ని వార్తలు