ఇటీవలే వివాహం.. దుర్గంచెరువులో దూకి యువతి ఆత్మహత్య.. ఏం జరిగింది?

28 Sep, 2022 17:17 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: నగరంలోని దుర్గంచెరువుపై నిర్మించిన కేబుల్‌ బ్రిడ్జిపై నుంచి దూకి ఓ యువతి ఆత్మహత్యయత్నం చేసింది. అది గమనించిన వాహనదారులు.. ఈ విషయాన్ని లేక్‌ పోలీసులకు తెలిపారు. దీంతో, రంగంలోకి దిగిన లేక్‌ పోలీసులు.. యువతి కోసం స్పీడ్‌బోట్స్‌తో గాలిస్తున్నారు. కాగా, ఆత్మహత్యాయత్నం చేసిన యువతిని అబ్దుల్లాపూర్‌మెట్‌కు చెందిన స్వప్న(23)గా పోలీసులు గుర్తించారు. అయితే, అనారోగ్య సమస్యల కారణంగానే ఆమె ఆత్మహత్య చేసుకున్నట్టు తెలుస్తోంది. ఇక, స్వప్నకు ఇటీవలే వివాహం జరిగినట్టు తెలుస్తోంది.

కాగా, కేబుల్‌ బ్రిడ్డి వద్ద స్వప్నకు సంబంధించిన హ్యాండ్‌ ఆధారంగా ఆమె ఆధారాలు సేకరించారు. దీంతో, పోలీసులు.. ఆమె కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఈ క్రమంలో వారు కేబుల్‌ బ్రిడ్డి వద్దకు వస్తున్నట్టు తెలుస్తోంది. ఇక, ఆమె హ్యాండ్‌ బ్యాగ్‌లో ఆసుపత్రికి సంబంధించిన పత్రాలు ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. కాగా, ఇప్పటి వరకు కేబుల్‌ బ్రిడ్డిపై నుంచి దూకి దాదాపు ఎనిమిది మంది ఆత్మహత్య చేసుకున్నట్టు సమాచారం. 

మరిన్ని వార్తలు