వైఎస్‌ రాజశేఖరరెడ్డికి భారతరత్న ఇవ్వాలి: ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి

8 Jul, 2021 14:01 IST|Sakshi

సాక్షి, జాగిత్యాల: దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డికి భారతరత్న ఇవ్వాలని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పేర్కొన్నారు. మహానేత జయంతి సందర్భంగా జాగిత్యాలలో ఆయన జయంతి వేడుకల్లో ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్‌ చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం జీవన్‌రెడ్డి మాట్లాడుతూ.. ''తెలుగుజాతికి ప్రపంచంలో గుర్తింపు తెచ్చిన మహా నాయకుడు వైఎస్సార్‌. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, సంక్షేమ పథకాలకు బాట వేసిన నాయకుడు.  ఏపీ, తెలంగాణలో చేపడుతున్న ప్రాజెక్టులకు ఆద్యుడు వైఎస్సార్‌‌. వైఎస్సార్‌కు భారతరత్న ప్రకటించేలా ఏపీ, తెలంగాణ సీఎంలు కేంద్రాన్ని కోరాలి'' అని తెలిపారు
 

మరిన్ని వార్తలు