అది కూడా తెలియదా?.. రాహుల్‌పై ఎమ్మెల్సీ కవిత సెటైర్లు..

21 Oct, 2023 12:50 IST|Sakshi

సాక్షి, జగిత్యాల: కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీపై బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత సీరియస్‌ కామెంట్స్‌ చేశారు. రాహుల్‌ గాంధీ తన స్క్రిప్ట్‌ రైటర్‌ మార్చుకోవాలని హితవు పలికారు. తెలంగాణతో కాంగ్రెస్ పార్టీకి విద్రోహ అనుబంధం ఉంది అంటూ ఘాటు విమర్శలు చేశారు. 

కాగా, ఎమ్మెల్సీ కవిత శనివారం మెట్‌పల్లిలో మీడియాతో మాట్లాడుతూ.. కాంగ్రెస్‌ ఎమ్మెల్సీ జీవన్‌ రెడ్డి తన పెద్దరికాన్ని మరిచి బతుకమ్మపై కామెంట్స్‌ చేశారు. తన పేరుతో(కవిత) ఎలిజిబెత్‌ రాణి అని మాట్లాడి ఆయన పెద్దరికాన్ని కోల్పోయారు. రాహుల్‌ గాంధీకి తెలివికి లేదు. తెలంగాణలో బీసీ గణన చేయాలనుకుంటున్నాడు అంటా. ఇలా అవగాహన లేకుండా మాట్లాడటం చూసి ప్రజలు నవ్వుకుంటున్నారు. కాంగ్రెస్‌ పార్టీ హయాంలోనే నిజాం షుగర్స్‌ ఫ్యాక్టరీ పెట్టారని చెబుతున్నారు. కానీ, 1937లోనే నిజాం రాజు ఫ్యాక్టరీని నెలకొల్పాడు. ఇలా అవగాహన లేకుండా మాట్లాడటం విడ్డూరంగా ఉంది. 

గల్ఫ్ కార్మికులు తెలంగాణకు వచ్చేయాలి. ఇక్కడ ఎన్నో ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి. తెలంగాణతో కాంగ్రెస్ పార్టీకి విద్రోహ అనుబంధం ఉంది. ఎప్పుడు తెలంగాణ గురించి మాట్లాడని నాయకులు ఇప్పుడు తెలంగాణకు అనుబంధం ఉంది అని చెప్పడం హాస్యాస్పదం. చక్కర కర్మాగారం ప్రైవేటీకరణ చేసినప్పుడు కాంగ్రెస్ నాయకులు ఏం చేశారు?. ఆ తర్వాత చక్కర కర్మాగారాన్ని పట్టించుకోకపోవడంతో మూతపడే పరిస్థితి వచ్చింది. 2015లో బీఆర్ఎస్ పార్టీ కర్మాగారం తెరిపిస్తానంటే.. బీజేపి ఎంపీ లీగల్ సమస్య తీసుకువచ్చాడు. అందుకే కర్మాగారం తెరిపించలేదు. చక్కర కర్మాగారం తెరిపించేందుకు బీఆర్ఎస్ పార్టీ ఎంతో కృషి చేసింది. కానీ లీగల్ ఇబ్బందులు తలెత్తుతున్నాయి’ అని తెలిపారు. 

ఇది కూడా చదవండి: బీజేపీ నుంచి బరిలో ఎంపీలు.. లక్ష్మణ్‌ కీలక వ్యాఖ్యలు

మరిన్ని వార్తలు