42 చోట్ల విద్యుత్ అంతరాయం

14 Sep, 2013 02:20 IST|Sakshi

విశాఖపట్నం, న్యూస్‌లైన్: వినియోగదారుడు: సార్ నేను అడ్డురోడ్డు దగ్గరున్న కొరుప్రోలు నుంచి అప్పలనాయుడ్ని మాట్లాడుతున్నాను. నిన్న అర్ధరాత్రి నుంచి మా ఊర్లో కరెంట్ లేదు. రాత్రి నుంచి ఎన్ని సార్లు ఫోన్ చేసినా ఎవరూ ఎత్తలేదు. ఉదయాన్నే కరెంట్ ఆఫీస్‌కు వెళ్తే అక్కడ ఎవరూ లేరు.
 
కంట్రోల్ రూం సిబ్బంది: ఒక ఏఈ గార్ని మీ ఊరికి, దేవరాపల్లికి ప్రత్యేకంగా పంపించాం. ఈ ఊర్లోనే పెద్ద సమస్య తలెత్తింది. అందుకే ఈ ఊరు గుండా వెళ్లే లైన్‌ల ద్వారా సరఫరా నిలిచిపోయింది. కరెంట్ మాత్రం ఎప్పుడొస్తుందో చెప్పలేం గానీ త్వరలోనే ఇచ్చేస్తాం... ఇదీ జిల్లాలో కరెంట్ పరిస్థితి. పలు ప్రాంతాల్లో రాత్రి నుంచి అంధకారం నెలకొంది. ఎప్పుడొస్తుందో తెలియని వినియోగదారులు కరెంట్ కోసం ఆశగా ఎదురుచూస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 42 చోట్ల విద్యుత్ లైన్లు తెగిపోయాయి. విద్యు త్ ఉద్యోగుల సమ్మెతో కోటవురట్ల మండలంతోపాటు నర్సీపట్నం, నాతవరం మండలాల్లోని గ్రామాలు చీకట్లో మగ్గుతున్నాయి.

కోట వురట్ల మండలం పాములవాకలో 33 కె.వి సబ్‌స్టేషన్ ఉంది. దీని పరిధిలోని ఆక్సాహేబుపేట, వేములపూడి ఫీడర్లలో సాంకేతిక సమస్యలు తలెత్తాయి. ఈ కారణంగా నాతవరం మండల చెర్లోపాలెం, కోటవురట్ల మండలం రామన్నపాలెం, పి.కె.పల్లి, చినబొడ్డేపల్లి, ఆర్.కొత్తూరు, కె.కొత్తూరు, బోడపాలెం, నర్సీపట్నం మండ లం అమలాపురం, దుగ్గాడ, బంగారయ్యపేట, యరకన్నపాలం, వేములపూడి గ్రామాల్లో గురువారం సాయంత్రం 4 గంటల నుంచి విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. ఇలా 13 గ్రామాల్లో అంధకారం అలుముకుంది. విద్యుత్ సమస్య తో చినబొడ్డేపల్లి, కె.కొత్తూరు, ఆర్.కొత్తూరు, బోడపాలెం, పి.కె.పల్లి, రామన్నపాలెం తదితర గ్రామాల్లో రక్షిత మంచినీటి పథకాలు పనిచేయక ఆయా గ్రామాల వారు ఇబ్బంది పడుతున్నారు.

ఎస్.రాయవరం  మండలం కొరుప్రో లు సబ్ స్టేషన్‌లో బ్రేక్‌డౌన్‌తో దాని పరిధిలోని18 గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. తాగునీటి సరఫరా నిలిచిపోయింది. ప్రజలు ఇబ్బందికి గురయ్యారు. ప్రైవేటు వారితో శుక్రవారం పునరుద్ధరించడంతో కొందరు ఊపిరి పీల్చుకున్నారు. సిబ్బంది సమ్మె కారణంగా నర్సీపట్నంలో గురువారం రాత్రి 7 గంటలకు సరఫరా నిలిచిపోయింది. ఉద్యోగులు అందుబాటులో లేకపోవడంతో పునరుద్ధరణ కాలేదు. చోడవరం, మాడుగుల నియోజకవర్గాల పరిధి లో 148గ్రామాలు అంధకారంలో ఉన్నాయి. మరో 150 గ్రామాల్లో తరచూ సరఫరాకు అంతరాయం ఏర్పడుతోంది. ఆయా ప్రాంతాల నుం చి తరచూ ఫిర్యాదులు నమోదవుతున్నాయి. అధికారులు తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు.

 చిన్న సమస్యలే..!

 జిల్లా వ్యాప్తంగా పలు ఫిర్యాదుల్లో వచ్చేవన్నీ చిన్నచిన్న సమస్యలే. ఫ్యూజ్‌ను సరి చేస్తే అనేక గ్రామాలకు విద్యుత్‌ను పునరుద్ధరించవచ్చు. కానీ ఆ పని చేసేందుకు కూ డా సిబ్బంది లేకపోవడంతో గ్రామాలకు గ్రామాలు అం దకారంలోనే మగ్గుతున్నాయి. ట్రాన్స్‌ఫార్మర్లు పేలిన సం ఘటనలు రెండు మూడు చోట్ల మాత్రమే ఉన్నాయి. వా టిని మార్పు చేసేందుకు కాస్త సమయం పడుతుంది. కానీ గ్రామాల్లో ఫ్యూజ్ ను సరి చేయడానికి కూడా ఉద్యోగు లు ముం దుకు రాకపోవడంతో సమస్య జఠిలంగా ఉం ది. సమైక్యాంధ్ర కోసం సమ్మె చేస్తున్న విద్యుత్ ఉద్యోగులు ఆదివారం నుంచి విధుల్లో చేరనున్నారు. ఆ రోజు ఉదయం మొబైల్ సిమ్‌లను తిరిగి స్వాధీనం చేసుకుని విధుల్లో చేరతారు.
 

>
మరిన్ని వార్తలు