జీతాలడిగితే.. ఉద్యోగాలు లేకుండా చేస్తా..

22 Jun, 2019 10:21 IST|Sakshi
యూజీడీ సీవేజ్‌ ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌

సాక్షి, విజయనగరం : జీతాలు అడిగితే ఉద్యోగాల నుంచి తొలగిస్తామని ఏఈ రాజ్‌కుమార్, కాంట్రాక్టర్‌ భరత్‌ బెదిరింపులకు దిగుతున్నారని నరవ యూజీడీ కాంట్రాక్ట్‌ ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘జీతాలిప్పించండి మహాప్రభో’ శీర్షికతో ఈ నెల 18న సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీనికి స్పందించి జీతాలివ్వాల్సిందిపోయి ఉద్యోగాలు తీసేస్తామంటూ కాంట్రాక్టర్‌ భరత్, ఆయనకు వంతపాడుతూ ఏఈ రాజ్‌కుమార్‌ బెదిరింపులకు దిగుతున్నారు. ఉద్యోగుల పక్షాన ఉండవలసిన ఏఈ.. కాంట్రాక్టర్‌కు వత్తాసు పలుకుతుండడం పలు అనుమానాలకు దారితీస్తోంది.

కాంట్రాక్ట్‌ సమయం ముగిసినా ఇంకా ఇక్కడి ప్లాంట్లో చెలామణి చేస్తున్నాడని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. జీతాలు ఇవ్వకపోయినా నిబద్ధతో విధులు నిర్వహిస్తున్నామన్న జాలి కూడా చూపడం లేదని వాపోతున్నారు. తమ సమస్యలను జీవీఎంసీ కమిషనర్‌ దృష్టికి తీసుకెళ్లినా ప్రయోజనం లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికైనా తమ జీతాలు చెల్లించి, ఉద్యోగ భద్రత కల్పించాలని కోరుతున్నారు. దీనిపై ఏఈ రాజ్‌కుమార్‌ను వివరణ కోరేందుకు ఫోన్‌లో ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. 

మరిన్ని వార్తలు