దేశంలో ఏపీనే టాప్‌

26 Apr, 2019 09:12 IST|Sakshi

సాక్షి, అమరావతి : జీఎస్టీ వసూళ్లలో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం దేశంలోనే అగ్రస్థానంలో నిలిచింది. జీఎస్టీ ప్రారంభం నుంచి ఏపీలో పన్ను వసూళ్లు గణనీయంగా పెరిగాయి. బెంచ్ మార్క్ దాటి 4 శాతం అదనంగా వసూళ్లు అయ్యాయి. జీఎస్టీ అమల్లోకి వచ్చాక ఏపీలో పన్ను వసూళ్లు ఒక్కసారి కూడా తగ్గలేదు. వాణిజ్య పన్నుల వసూళ్లలో ఏపీ 14.98 శాతం వృద్ధి సాధించింది. అదేవిధంగా జీఎస్టీ పరిధిలో పన్ను వసూళ్లు 18.10 శాతం వృద్ధి, 21087 కోట్ల వసూళ్లు. పెట్రో ఉత్పత్తుల విక్రయాల్లో 10 .68 శాతం జీఎస్టీ వృద్ధి, 10,829.85 కోట్ల వసూళ్లు.

మద్యం విక్రయాల్లో 13.82 శాతం జీఎస్టీ  వృద్ధి, 10,915.7 కోట్ల పన్ను వసూళ్లు. వృత్తి పన్ను వసూళ్లలో 3.5 శాతం జీఎస్టీ వృద్ధి , 221.28 కోట్ల వసూళ్లు సాధించింది. 2017-18లో 37,444.95 కోట్లు.. 2018-19లో  5,608 కోట్ల పెరుగుదలతో 43,053 కోట్లు.. 2017-18లో 53 వేల కోట్ల వార్షిక పన్ను వసూళ్లు, 18-19లో  60 వేల కోట్ల పన్నులు వసూళ్లయ్యాయి.

మరిన్ని వార్తలు