గిరిజన గ్రామాల్లో మలేరియా

23 Apr, 2015 02:58 IST|Sakshi

- జ్వరంతో మంచం పడుతున్న గిరిజనులు
- గిరి శిఖర గ్రామాల్లో దుర్భర పరిస్థితి
- పట్టించుకోని వైద్యారోగ్య శాఖాధికారులు
పార్వతీపురం :
గిరిజన గ్రామాలు మలేరి యాతో వణుకుతున్నాయి. గ్రామాల్లో ఇంటికి ఒకరిద్దరు చొప్పున మంచం పడుతున్నారు. గిరి శిఖర గ్రామాల్లో అయితే పరిస్థితి మరీ దయనీయంగా మారింది. గతవారం రోజులుగా పార్వతీపురం సబ్- ప్లాన్ పరిధిలోని కొమరాడ, గుమ్మలక్ష్మీపురం, కురుపాం, జియ్యమ్మవలస, పా ర్వతీపురం, మక్కువ, సాలూరు తదితర మండలాల్లో మలేరియా, టైఫాయిడ్ తది తర జ్వరాలు విజృంభిస్తున్నాయి.

ఈరోజుల్లో జ్వరం అంటే మలేరియాగానే ఉంటోందని వైద్యాధికారులు అంటున్నారు. ప్రస్తుతం మలేరియా జ్వరానికి వైద్యం ఖర్చుతో కూడుకున్నదిగా మార డం, ఆలస్యం చేస్తే పీవీ, పీఎఫ్ ఆపై సెరిబ్రల్ మలేరియాగా మారి ప్రాణాల మీదకు వస్తోంది. ఆర్థికంగా ఉన్నవారు సమీప పార్వతీపురంలోని వివిధ ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందుతుండగా పేదలు స్థానికంగా అందుబాటులో ఉన్న సంచి వైద్యులను ఆశ్రయిస్తున్నారు.  

సబ్‌ప్లాన్  ఏరియాలో మలేరియా తిష్ఠ...
మూడేళ్లుగా పార్వతీపురం సబ్-ప్లాన్‌లో మలేరియా తిష్ఠ వేసింది. ఎవరికైనా జ్వరమంటే అది తప్పనిసరిగా మలేరియానే అవుతోందని స్థానిక వైద్యులు అంటున్నా రు. గ్రామాల్లో పారిశుద్ధ్య లోపం, పరిసరాల పరిశుభ్రతపై గిరిజనులకు అవగాహన లేకపోవడమే ఈ వ్యాధి విజృంభణకు కారణం. ప్రతి ఏడాది సబ్-ప్లాన్‌లో వేలాది మలేరియా కేసులు నమోదవుతున్నాయి. 2011లో ఐటీడీఏ పరిధిలో 29 42 మలేరియా కేసులు నమోదయ్యాయి. 2012లో 4096, 2013లో 2008 మలేరియా కేసులు అధికారికంగా నమోదయ్యాయి. గత పక్షం రోజులుగా పార్వతీపురంలో ఏ ఆసుపత్రి చూసినా వందలాది మంది జ్వరపీడితులతో కిటకిటలాడుతున్నాయి.

మరిన్ని వార్తలు