‘అల్ జజీరా’పై 5 రోజుల నిషేధం | Sakshi
Sakshi News home page

‘అల్ జజీరా’పై 5 రోజుల నిషేధం

Published Thu, Apr 23 2015 2:57 AM

'Al Jazeera' ban on 5 days

న్యూఢిల్లీ: భారతదేశ పటాన్ని తప్పుగా చూపిన అంతర్జాతీయ న్యూస్ చానల్ అల్ జజీరాపై కేంద్ర సమాచార, ప్రసారాల మంత్రిత్వ శాఖ ఐదు రోజుల పాటు నిషేధం విధించింది. ఈ నెల 22 అర్ధరాత్రి 12.01 గంటల నుంచి ఈ నెల 27 అర్ధరాత్రి 12.01 గంటల వరకు ఈ చానల్ స్థానంలో బ్లాంక్ స్క్రీన్ దర్శనమిస్తుంది.

2013, 2014 నాటి అల్ జజీరా కార్యక్రమాల్లో భారత్ మ్యాప్‌ను తప్పుగా చూపింది. దీనిని పరిశీలించాల్సిందిగా కేంద్ర సమాచార శాఖ సర్వేయర్ జనరల్ ఆఫ్ ఇండియాకు నివేదించింది. చానల్ చూపిన భారత్ పటాల్లో జమ్మూ కశ్మీర్‌లో కొంత భాగాన్ని(పీఓకే, ఆక్సాయ్‌చిన్) చూపలేదని ఎస్‌జీఐ గమనించింది.
 

Advertisement
Advertisement