అధికారమే పరమావధిగా బూటకపు హామీలు

26 Nov, 2014 02:31 IST|Sakshi

 ద్వారకాతిరుమల : అధికారమే పరమావధిగా టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు బూటకపు హామీలిచ్చి అధికారంలోకి వచ్చారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ (నాని) ధ్వజమెత్తారు. ద్వారకాతిరుమల యాదవ కల్యాణ మండపంలో మంగళవారం నిర్వహించిన వైఎస్సార్సీపీ మండలస్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. టీడీపీ అధికారంలోకి వచ్చింది వైఎస్సార్‌సీపీ నాయకులు, కార్యకర్తలను వేధించడానికే అన్నట్లుగా ఆ పార్టీ నేతలు ప్రవర్తిస్తున్నారని మండిపడ్డారు. ఇప్పటివరకు గ్రామాల్లో తమ పార్టీ కార్యకర్తలు నిర్వహించిన చౌకడిపోలను రద్దు చేయిస్తూ వచ్చారని, అలాగే కొందరి ఇళ్లకు దారిలేకుండా గొడవలు పెట్టుకుని అనవసరపు కేసుల్లో ఇరికిస్తున్నారని, కక్షసాధింపు చర్యలు ఇప్పటికీ జిల్లాలో కొనసాగుతూనే ఉన్నాయని ఆరోపించారు.
 
 జిల్లాలో పార్టీ నాయకులు, కార్యకర్తలకు రక్షణ కల్పించాలని అధినేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి తనకు సూచించారని, దానికి అనుగుణంగా టీడీపీ కక్షసాధింపు చర్యలను తీవ్రంగా వ్యతిరేకిస్తామని హెచ్చరించారు. ప్రతి గ్రామంలో 10 మంది సభ్యులతో ఒక కమిటీని ఏర్పాటు చేసి తమ పార్టీ కార్యకర్తలకు రక్షణ కల్పిస్తామని హామీ ఇచ్చారు. ఇసుక ధరను, దానిని పొందే విధానాలను బంగారం కొనుగోలు కంటే దారుణంగా మార్చిన ఘనత ఒక్క టీడీపీకే దక్కుతుందని దుయ్యబట్టారు. వ్యవసాయ, డ్వాక్రా రుణాల మాఫీపై చంద్రబాబు రోజుకో మాట చెబుతూ వారిని ఇంకా మోసగిస్తూనే ఉన్నారని, మాఫీ పేరుతో వడ్డీభారాలను పెంచి రైతులను, డ్వాక్రా మహిళలను చంద్రబాబు నట్టేటముంచనున్నారని ఆందోళన వ్యక్తం చేశారు.
 
 తెలుగుదేశం పార్టీకి ఓటు వేసి తప్పుచేశామని ఇప్పుడు ప్రతి ఒక్కరూ బాధపడుతున్నారని పేర్కొన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు ఇచ్చిన రైతు, డ్వాక్రా, చేనేత రుణాల మాఫీ, ఇతర హామీలను అమలు చేయనందుకు నిరసనగా వచ్చేనెల 5న కలెక్టరేట్ వద్ధ మహాధర్నా నిర్వహిద్దామని ఈ సందర్భంగా నాని పిలుపునిచ్చారు. గోపాలపురం నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు, రాష్ట్ర కమిటీ సభ్యులు చెలికాని రాజబాబు, మండల కన్వీనర్ బుసనబోయిన సత్యనారాయణ, పార్టీ అధికార ప్రతినిధులు పల్నాటి బాబ్జీ, ముప్పిడి సంపత్‌కుమార్, మహిళా అధ్యక్షురాలు వందనపు సాయిబాల పద్మ పాల్గొన్నారు.
 
 కార్యకర్తలపై దౌర్జన్యాలు చేస్తే చూస్తూ ఊరుకోం
 పోతవరం (నల్లజర్ల రూరల్) : వైఎస్సార్ సీపీ కార్యకర్తలపై అనవసరపు దౌర్జన్యాలు చేస్తే చూస్తూ ఊరుకోబోమని వైఎస్సార్ సీపీ జిల్లా ఆధ్యక్షుడు ఆళ్ల నాని టీడీపీ శ్రేణులను హెచ్చరించారు. మంగళవారం రాత్రి పోతవరంలో పెండ్యాల వీరరాఘవులు ఇంటివద్ద మండల పార్టీ కన్వీనర్ గగ్గర శ్రీను అధ్యక్షతన జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పార్టీ కార్యకర్త ఏఒక్కరూ ఒంటరివాడు కాదన్న సంగ తి టీడీపీ తెల్సుకుంటే మంచిదన్నారు. తమ పార్టీ కార్యకర్తలపై వేధింపులకు, దౌర్జన్యాలకు దిగి సమయాన్ని వృథా చేయకుండా రుణ మాఫీపై తగు నిర్ణయం తీసుకునేలా టీడీపీ అధినేత మనసు మార్చడానికి ప్రయత్నించాలని హితవు పలికారు.
 
 అందరి ఆమోదయోగ్యంతో త్వరలోనే మండల, గ్రామస్థాయిలో కమిటీలు ఏర్పాటు చేయనున్నట్టు చెప్పారు. తొలుత కార్యకర్తల అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నా రు. తొమ్మండ్రు రవి, పాపా నాగేశ్వరా వు, గ్యార శ్రీను, యలమర్తి వాసు, ము ప్పిడి వెంకటరత్నం, తల్లంశెట్టి మాధవరావు, పెండ్యాల వీరరాఘవులు తదితరులు మాట్లాడుతూ పార్టీకి మండలం లో బలమైన నాయకత్వం అవసరమ ని, టీడీపీ ఆడగాలు ఎక్కువయ్యాయని తదితర సమస్యలను సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తలారి వెంకట్రావు, ముప్పిడి సంపత్‌కుమార్, చెలికాని రా జబాబు, రామతిరుపతిరెడ్డి, వందనపు సాయిబాల, దాపర్తి వేణు, కారుమంచి రమేష్, తొమ్మడ్రు రమేష్, ఇమ్మణ్ణి సత్తిపండు, డాక్టర్ అల్లూరి సూర్య చంద్రరా వు, నాయుడు శ్రీను, తలంశెట్టి నేతాజీ, అబ్బూరి రాజయ్య, పంది సత్యనారాయణ, చేబ్రోలు అబ్బులు పాల్గొన్నారు.
 

మరిన్ని వార్తలు