‘పేదల హృదయాల్లో కాంగ్రెస్ పదిలం’

30 Jun, 2014 21:49 IST|Sakshi
‘పేదల హృదయాల్లో కాంగ్రెస్ పదిలం’

నెల్లూరు: ఎన్నికల్లో గెలుపోటములు సహజమేనని, పేదల హృదయాల్లో కాంగ్రెస్ పార్టీ పదిలంగా ఉంటుందని ఆలిండియా కాంగ్రెస్ కమిటీ ఎస్సీ సెల్ చైర్మన్  కొప్పుల రాజు అన్నారు. సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఓటమికి గల కారణాలను తెలుసుకునేందుకు సోమవారం ఆయన శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాకు వచ్చారు.

ఈ సందర్భంగా నెల్లూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ, కాంగ్రెస్ పార్టీకి క్షేత్రస్థాయిలో బలమైన క్యాడర్ ఉందన్నారు. వచ్చే సార్వత్రిక ఎన్నికలనాటికి తిరిగి కాంగ్రెస్ అధికారాన్ని చేజిక్కించుకుంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు.

మరిన్ని వార్తలు